Share News

Nicholas Pooran: పంత్‌ను దించేసిన పూరన్.. కిందపడినా సిక్స్ బాదేశాడు

ABN , Publish Date - Dec 02 , 2024 | 06:06 PM

Nicholas Pooran: టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నిలబడిన చోటు నుంచి భారీ షాట్లు కొట్టడమే కాదు.. అవసరమైతే కింద పడి కూడా సిక్సులు బాదుతాడు. అలాంటి పంత్‌ను ఓ విండీస్ స్టార్ కాపీ చేశాడు.

Nicholas Pooran: పంత్‌ను దించేసిన పూరన్.. కిందపడినా సిక్స్ బాదేశాడు

Abu Dhabi T10: టీమిండియా పించ్ హిట్టర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ స్టైల్ చాలా వైవిధ్యంగా ఉంటుంది. నిలబడిన చోటు నుంచి భారీ షాట్లు కొట్టడమే కాదు.. అవసరమైతే కింద పడి కూడా సిక్సులు బాదుతాడు. రివర్స్ స్వీప్‌లు, స్కూప్ షాట్స్ ఆడుతూ బౌలర్లను కన్‌ఫ్యూజ్ చేస్తాడు. దీంతో ఏ లెంగ్త్‌లో ఎలాంటి డెలివరీస్ వేయాలో వాళ్లకు తోచదు. అమ్ములపొదిలో చాలా షాట్లు ఉండటంతో ఎలాంటి బాల్ వేసినా దాన్ని బౌండరీకి తరలిస్తుంటాడు పంత్. ఒక్కోసారి కిందపడి మరీ బాల్‌ను స్టాండ్స్‌లోకి పంపిస్తుంటాడు. ఇది అతడి ట్రేడ్‌మార్క్ షాట్‌గా మారిపోయింది. అలాంటి షాట్‌ను వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్‌ దించేశాడు. ఓ మ్యాచ్‌లో పంత్‌ను కాపీ కొట్టాడీ కరీబియన్ విధ్వంసకారుడు.


కిందపడినా బాదేశాడు

క్రీజు నుంచి పక్కకు జరిగి వెనుక ఉన్న బౌండరీని టార్గెట్ చేసుకొని పంత్ కొట్టే స్కూప్ షాట్ బాగా ఫేమస్ అయింది. బౌలర్ మైండ్‌ను అర్థం చేసుకొని బంతిని సరిగ్గా అంచనా వేస్తూ, పర్ఫెక్ట్ టైమింగ్‌తో పంత్ ఆ షాట్ బాదినప్పుడు కనులవిందుగా ఉంటుంది. ఇవాళ అదే షాట్‌ను పూరన్ రిపీట్ చేశాడు. పంత్ మాదిరిగా క్రీజులో నుంచి పక్కకు జరిగి బంతిని స్టాండ్స్‌లోకి తరలించాడు. బాల్‌ను బాదే టైమ్‌లో కిందపడినా నిభాయించుకొని దాన్ని సిక్స్‌గా మలిచిన తీరు హైలైట్ అనే చెప్పాలి.


ఒంటిచేత్తో విజయం

పూరన్ షాట్ బాదిన తీరు, బాడీని బ్యాలెన్స్ చేసుకున్న విధానం హైలైట్‌గా నిలిచాయి. పంత్ స్థాయిలో కాకపోయినా పూరన్ షాట్ కూడా స్టైలిష్‌గా ఉంది. అబుదాబి లీగ్‌లో భాగంగా డెక్కన్ గ్లాడియేటర్స్ తరఫున బరిలోకి దిగిన పూరన్.. మోరిస్విల్లే సాంప్ ఆర్మీతో జరిగిన ఈ క్వాలిఫయర్ మ్యాచ్‌లో అదరగొట్టాడు. మొత్తంగా 33 బంతుల్లో 72 పరుగులతో టీమ్‌కు సింగిల్ హ్యాండ్‌తో విక్టరీని అందించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 బౌండరీలు, 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. కాగా, పంత్-పూరన్ వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఒకే జట్టుకు ఆడనున్నారు. లక్నో సూపర్ జియాంట్స్ తరఫున బరిలోకి దిగనున్నారీ సూపర్‌స్టార్లు.


Also Read:

500 కోట్లు మిస్.. చేజేతులా చేసుకున్న బుమ్రా

చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా.. పింక్ బాల్ టెస్ట్‌లో రికార్డులకు పాతరే

వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు.. 46 ఏళ్లలో ఇదే తొలిసారి

పాకిస్థాన్ గాలి తీసిన అక్తర్.. మీరు మారరు అంటూ..

For More Sports And Telugu News

Updated Date - Dec 02 , 2024 | 06:14 PM