Share News

Akash Deep: ఆకాశ్‌దీప్ సిక్సుల వర్షం.. రోహిత్-కోహ్లీ రియాక్షన్ చూస్తే నవ్వాగదు

ABN , Publish Date - Dec 17 , 2024 | 04:39 PM

Akash Deep: యంగ్ పేసర్ ఆకాశ్‌దీప్ టీమిండియాను ఒడ్డున పడేశాడు. సీనియర్ స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి కాపాడాడు.

Akash Deep: ఆకాశ్‌దీప్ సిక్సుల వర్షం.. రోహిత్-కోహ్లీ రియాక్షన్ చూస్తే నవ్వాగదు
Akash Deep

ఒక్కోసారి బ్యాటర్లు చేయలేని పని బౌలర్లు చేస్తారు. బంతితో వికెట్లు తీస్తూ టీమ్‌ను గెలిపించే బౌలర్లు.. అవసరమైతే బ్యాట్‌తో చెలరేగేందుకూ రెడీగా ఉంటారు. అందుకే టెయిలెండర్లను బ్యాటింగ్‌లో ఎంకరేజ్ చేస్తుంటాయి టీమ్ మేనేజ్‌మెంట్స్. ముఖ్యంగా టెస్టుల్లో వారిని నైట్ వాచ్‌మన్‌గా పంపడం లాంటివి చేస్తుంటారు. భారత జట్టులోనూ ఇది గమనించొచ్చు. అనిల్ కుంబ్లే నుంచి మహ్మద్ షమి వరకు చాలా మంది బౌలర్లు బ్యాటర్లుగానూ కొన్ని సమాయల్లో జట్టును ఆదుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా-ఆకాశ్‌దీప్ కూడా ఇవాళ అదే రోల్‌లో ఒదిగిపోయారు.


గండం నుంచి గట్కెక్కించారు

యంగ్ పేసర్ ఆకాశ్‌దీప్ టీమిండియాను ఒడ్డున పడేశాడు. సీనియర్ స్పీడ్‌స్టర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలసి భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి కాపాడాడు. గబ్బా టెస్ట్‌లో ఫాలో ఆన్ ప్రమాదంలో ఉన్న జట్టును బుమ్రా-ఆకాశ్‌దీప్ సేవ్ చేశారు. ఇద్దరూ చివరి వికెట్‌కు 39 పరుగులు జోడించారు. బుమ్రా 27 బంతుల్లో 10 పరుగులతో ఒక ఎండ్‌లో చక్కటి సహకారం అందించాడు. మరో ఎండ్‌లో ఆకాశ్‌దీప్ భారీ షాట్లతో కంగారూలను వణికించాడు. 31 బంతుల్లో 2 బౌండరీలు, ఒక భారీ సిక్స్‌తో 27 పరుగులు చేశాడతను. ఈ క్రమంలో అతడు కొట్టిన ఓ సిక్స్‌కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చారు. ఏం కొట్టాడు భయ్యా అంటూ షాక్ అయ్యారు.


డ్రెస్సింగ్ రూమ్ బయటకు వచ్చి..

ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో బుమ్రా ఫస్ట్ సిక్స్ కొట్టాడు. ఆ తర్వాత ఆకాశ్‌దీప్ మరో సిక్స్‌తో కంగారూ సారథికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. తొలుత ఆఫ్ సైడ్ బౌండరీ కొట్టిన యంగ్ సీమర్.. ఆ తర్వాత లెగ్ సైడ్ కళ్లుచెదిరే రీతిలో భారీ సిక్స్ కొట్టాడు. ఫాలో ఆన్ గండం పోవడం, ఆకాశ్ భారీ షాట్లతో ఎంటర్‌టైన్ చేయడంతో రోహిత్-కోహ్లీ మురిసిపోయారు. ముఖ్యంగా ఆ సిక్స్ చూసి షాక్ అయ్యారు. విరాట్ అయితే డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొడుతూ అతడ్ని ఎంకరేజ్ చేశాడు. భలే కొట్టావంటూ మెచ్చుకున్నాడు. కోచ్ గంభీర్ కూడా అతడ్ని ప్రోత్సహించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Also Read:

కేఎల్ రాహుల్ క్లాసిక్ బ్యాటింగ్.. ఇది శానాకాలం యాదుంటది

జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది

స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. చూసితీరాల్సిన వీడియో ఇది..

బచ్చా బౌలర్ డబుల్ హ్యాట్రిక్.. తోపుల వల్ల కానిది సాధించాడు

For More Sports And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 05:20 PM