Share News

Boxing Day Test: ఆసీస్ టీమ్‌లోకి జూనియర్ పాంటింగ్.. వీడు మామూలోడు కాదు

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:14 PM

Boxing Day Test: ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే మహా సంగ్రామంలో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ తరుణంలో కంగారూ టీమ్ మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చింది.

Boxing Day Test: ఆసీస్ టీమ్‌లోకి జూనియర్ పాంటింగ్.. వీడు మామూలోడు కాదు
Sam Konstas

IND vs AUS: ప్రతిష్టాత్మక బాక్సింగ్ డే టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం నుంచి జరిగే మహా సంగ్రామంలో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. తొలి టెస్టు‌లో టీమిండియా, రెండో టెస్టులో కంగారూలు గెలిచారు. మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో నాలుగో టెస్టుపై ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌ దాదాపుగా సిరీస్ పట్టేసినట్లే. ఇందులో నెగ్గితే ఆఖరి మ్యాచ్‌లో మరింత జోష్‌తో బరిలోకి దిగొచ్చు. అదే ఓడితే సిరీస్ పోయే ప్రమాదం ఉండటంతో రెండు జట్లు బాక్సింగ్ డే టెస్ట్‌లో విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. ఈ తరుణంలో కమిన్స్ సేన మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..


పక్కా ప్లానింగ్‌తోనే..

బాక్సింగ్ డే టెస్ట్‌ కోసం తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది ఆస్ట్రేలియా. మూడో టెస్టులో ఆడిన టీమ్‌నే దాదాపుగా కంటిన్యూ చేస్తున్నారు. అయితే జట్టులో రెండు మార్పులు చేశారు. గాయపడిన జోష్ హేజల్‌వుడ్ స్థానంలో స్కాట్ బోలాండ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అలాగే ఓపెనర్ నాథన్ మెక్‌స్వీనీ స్థానంలో కోన్స్టాస్‌ను రీప్లేస్ చేశారు. ఈ కోన్స్టాస్ మామూలోడు కాదు. ఇతడ్ని జూనియర్ పాంటింగ్ అని పిలుస్తారు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్‌లో చిచ్చరపిడుగుగా అతడు పేరు తెచ్చుకున్నాడు. పాంటింగ్ వారసుడిగా, కంగారూ భవిష్యత్ తారగా అతడు గుర్తింపు సంపాదించాడు. అలాంటి కోన్స్టాస్ గురించి మరింతగా తెలుసుకుందాం..


దంచుడుకు కేరాఫ్ అడ్రస్

ఇంకా 20 ఏళ్లు కూడా నిండని సామ్ కోన్స్టాస్ అత్యంత ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో పాటు బిగ్‌బాష్‌లో సిడ్నీ థండర్స్ తరఫున ఆడుతూ అక్కడి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో ఆడిన 11 మ్యాచుల్లో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు బాదాడు. రీసెంట్‌గా షెఫీల్డ్‌షీల్డ్ టోర్నీలో సౌత్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదాడు. భారత్-ఏతో జరిగిన అనధికార టెస్ట్‌లో 73 రన్స్‌తో ఆకట్టుకున్నాడీ యువ సంచలనం. సిడ్నీ థండర్స్ తరఫున బిగ్‌బాష్ లీగ్‌లో 27 బంతుల్లో 56 పరుగులతో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ నమోదు చేశాడు కోన్స్టాస్. ధనాధన్ బ్యాటింగ్‌తో రిజల్ట్‌ను తారుమారు చేసే ఈ చిచ్చరపిడుగును టీమిండియా ఎలా ఆపుతుందో చూడాలి.


Also Read:

అండర్‌-19 ప్రపంచకప్‌కు త్రిష, షబ్నమ్‌

దరఖాస్తులో తప్పులు దొర్లాయేమో!

వాడేసిన పిచ్‌లా?

For More Sports And Telugu News

Updated Date - Dec 25 , 2024 | 03:17 PM