Cricket News: భారత్-పాకిస్థాన్ బార్డర్‌లో స్టేడియం.. గట్టి స్కెచ్చే..
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:18 PM
Cricket News: నగరాలు లేదా పట్టణాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మించడం సాధారణమే. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియాలు నిర్మించిన దాఖలాలు కూడా ఉన్నాయి. కానీ ఏకంగా బోర్డర్ దగ్గర స్టేడియం కట్టడాన్ని ఊహించగలమా?
నగరాలు లేదా పట్టణాల్లో క్రికెట్ స్టేడియాలు నిర్మించడం సాధారణమే. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంకరేజ్ చేసేందుకు స్టేడియాలు నిర్మించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే సరిహద్దుల వద్ద స్టేడియం కట్టడాన్ని ఊహించగలరా? కానీ ఇది జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అది కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే భారత్-పాకిస్థాన్ మధ్య అంటే నమ్మడం అసాధ్యమే. అసలు ఊహించడానికే వింతగా ఉన్న ఈ ఆలోచన ఎలా పుట్టింది? ఈ స్కెచ్ వేస్తున్నది ఎవరు? అనేది ఇప్పుడు చూద్దాం..
స్టేడియం కట్టాల్సిందే..!
భారత్-పాకిస్థాన్ బార్డర్‌లో స్టేడియం నిర్మించాల్సిందేనని పాక్ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ అంటున్నాడు. ఇప్పటికే ఓ పాడ్‌కాస్ట్‌లో ఈ విషయం చెప్పానని.. మరోసారి గుర్తుచేస్తున్నానని తెలిపాడు. ఇందులో ఒక గేట్ భారత్ వైపు, మరోది పాకిస్థాన్ వైపు ఉండాలని సూచించాడు. ఇరు జట్ల ఆటగాళ్లు ఒక్కో ద్వారం ద్వారా స్టేడియంలోకి ప్రవేశించి మ్యాచ్ ఆడాలన్నాడు. అయితే దీనికి కూడా బీసీసీఐ, భారత ప్రభుత్వం అంగీకరించవంటూ సీరియస్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్‌కు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ నిరాకరించడం, భారత్ మ్యాచుల్ని హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించాలని ఐసీసీ ప్రకటించిన నేపథ్యంలో షెహజాద్ పైవ్యాఖ్యలు చేశాడు.
గోల్డెన్ ఛాన్స్ మిస్!
టీమిండియా మ్యాచుల్ని నిర్వహించే గోల్డెన్ ఛాన్స్ పాకిస్థాన్‌కు లభించిందని.. కానీ ఇప్పుడు అది మిస్ అయిందన్నాడు షెహజాద్. ఛాంపియన్స్ ట్రోఫీ పాక్‌లో నిర్వహించాలనేది మూడేళ్ల కింద డిసైడ్ అయిందని.. దీనికి అన్ని క్రికెట్ బోర్డులు ఒప్పుకున్నాయని తెలిపాడు. కానీ ఇప్పుడు ఐసీసీ యూటర్న్ తీసుకుందని ఫైర్ అయ్యాడు పాక్ క్రికెటర్. ఇక మీదట భారత జట్టు పాక్‌కు రాబోదని.. అది తేలిపోయిందన్నాడు. పీసీబీ బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకుందన్నాడు షెహజాద్. ఐసీసీ టోర్నీ కోసమే రాని జట్టు.. ఇంక సాధారణ టోర్నీల కోసం ఇక్కడికి విచ్చేస్తుందనేది అత్యాశే అవుతుందన్నాడు. ఆ విషయాన్ని ఇంక అందరూ మర్చిపోవాలని సూచించాడు. పాక్‌లో దాయాది జట్ల మధ్య మ్యాచ్ జరిగి ఉంటే అదిరిపోయేదని.. కానీ ఇక అది సాధ్యం కాదని తేలిపోయిందన్నాడు షెహజాద్.
Also Read:
అశ్విన్ భార్య ఎమోషనల్.. దాని గురించే ఆలోచిస్తున్నానంటూ..
టీమిండియా క్రికెటర్‌పై అరెస్ట్ వారెంట్.. ఎందుకంటే..
అశ్విన్ మోసం చేశాడు.. ఇలాంటోడు అనుకోలేదు: జడేజా
జహీర్..ఈ బాలిక బౌలింగ్ చూశావా?
For More Sports And Telugu News