IPL 2025: బ్రాండ్ వాల్యూలో ఆ ఐపీఎల్ టీమే టాప్.. సన్‌రైజర్స్ తగ్గేదేలే
ABN , Publish Date - Dec 05 , 2024 | 06:30 PM
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లే లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతా పెరుగుతూ పోతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రేజ్, పాపులారిటీ ఏటికేడు మరింత పెరుగుతూ పోతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఆవిర్భవించి 16 ఏళ్లు గడుస్తున్నా ఆదరణ విషయంలో తగ్గేదేలే అంటూ దూసుకెళ్తోంది. అందుకు తగ్గట్లే లీగ్ బ్రాండ్ వాల్యూ కూడా అంతకంతా పెరుగుతూ పోతోంది. 2008లో ప్రారంభమైన ఐపీఎల్.. క్రికెట్‌లో అతిపెద్ద లీగ్‌గా హవా నడిపిస్తోంది. క్రికెట్ కాకుండా ఇతర స్పోర్ట్స్‌లోనూ బడా లీగ్స్‌లో ఒకటిగా చలామణి అవుతోంది. అలాంటి ఐపీఎల్ బ్రాండ్ విలువ ఎంతో ఊహించడం కూడా కష్టమే. దాని బ్రాండ్ వాల్యూ ఎంత? టోర్నీలోని జట్లలో ఏ టీమ్ విలువ ఎంత? ఎవరు టాప్‌లో ఉన్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆ 4 సెంచరీ క్లబ్‌లో..
ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ.లక్ష కోట్లు దాటిపోయింది. 2009లో సుమారుగా రూ.17 వేల కోట్ల బ్రాండ్ వాల్యూ కలిగిన క్యాష్ రిచ్ లీగ్.. 2023లో మొదటిసారి 10 బిలియన్ డాలర్లను తాకింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా 12 బిలియన్ డాలర్లకు చేరుకుంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్స్ బ్రాండ్ వాల్యూ 100 మిలియన్ డాలర్లను దాటింది. బ్రాండ్ విలువ విషయంలో అన్ని జట్ల కంటే సీఎస్‌కే టాప్‌లో నిలిచింది. ఆ జట్టు వాల్యూ 52 శాతం పెరిగి 122 మిలియన్ డాలర్ల (సుమారుగా రూ.1,033 కోట్లు)కు చేరుకుంది.
అమాంతం పెరిగిన ఎస్‌ఆర్‌హెచ్ వాల్యూ
క్యాష్ రిచ్ లీగ్‌లో తోపు ఫ్రాంచైజీల్లో ఒకటైన ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూలో సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆ టీమ్ బ్రాండ్ విలువ 36 శాతం పెరిగి 119 మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.1,007 కోట్లు)కు చేరుకుంది. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవనప్పటికీ క్రేజ్ విషయంలో టాప్‌లో ఉండే ఆర్సీబీ బ్రాండ్ వాల్యూ 67 శాతం పెరిగి 117 మిలియన్ల (సుమారుగా రూ.990 కోట్లు)కు రీచ్ అయింది. గత సీజన్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన కేకేఆర్ బ్రాండ్ విలువ 38 శాతం పెరిగి 109 మిలియన్ల (దాదాపుగా రూ.922 కోట్లు)కు చేరుకుంది. తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ వాల్యూ ఏకంగా 76 శాతం పెరిగి 85 మిలియన్ల (సుమారుగా రూ.719 కోట్లు)కు రీచ్ అయింది.
Also Read:
ఇష్టం లేకపోయినా టీమ్ కోసమే ఆ పని చేస్తున్నా: రోహిత్ శర్మ
భువనేశ్వర్ సెన్సేషనల్ స్పెల్.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఎమోషనల్
అక్షర్ పటేల్ మాస్ బ్యాటింగ్.. వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకుతెచ్చేలా..
For More Sports And Telugu News