DC vs PBKS: ఢిల్లీని కట్టడి చేసిన పంజాబ్ బౌలర్లు.. చివర్లో అభిషేక్ మెరుపులు.. టార్గెట్ ఎంతంటే..?
ABN , Publish Date - Mar 23 , 2024 | 05:36 PM
పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేసినప్పటికీ.. చివర్లో అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ సాధించింది. పంజాబ్ కింగ్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం ఢిల్లీకి మైనసైంది.
ఛండీగడ్: పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా కట్టడి చేసినప్పటికీ.. చివర్లో అభిషేక్ పోరెల్(10 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ మంచి స్కోర్ సాధించింది. పంజాబ్ కింగ్స్ ముందు 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఢిల్లీ బ్యాటర్లలో ఏ ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. మంచి ఆరంభం లభించినప్పటికీ దానిని కొనసాగించలేకపోయారు. ముఖ్యంగా మిడిలార్డర్ వైఫల్యం ఢిల్లీకి మైనసైంది. 15 నెలల తర్వాత మైదానంలోకి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్(18) కూడా సత్తా చాటలేకపోయాడు. డెత్ ఓవర్లలో అక్షర్ రనౌట్ కావడం కారణంగా కూడా ఢిల్లీ భారీ స్కోర్ సాధించలేకపోయింది. పంజాబ్ బౌలర్లు కలిసికట్టుగా ఢిల్లీని కట్టడి చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(2/28), హర్షల్ పటేల్(2/47) సత్తా చాటారు. కీలక సమయాల్లో రబాడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ శుభారంభాన్ని అందించారు. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన వీరిద్దరు తొలి వికెట్‌కు 3.2 ఓవర్లలోనే 39 పరుగులు జోడించారు. 2 ఫోర్లు, 2 సిక్సులతో 12 బంతుల్లోనే 20 పరుగులు చేసిన మార్ష్‌ను 4వ ఓవర్‌లో యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం షాయ్ హోప్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన వార్నర్ రెండో వికెట్‌కు 35 పరుగులు జోడించాడు. 3 ఫోర్లు, 2 సిక్సులతో 21 బంతుల్లో 29 పరుగులు చేసిన వార్నర్‌ను 8వ ఓవర్ చివరి బంతికి పేసర్ హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 74 పరుగులకు ఢిల్లీ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. అనంతరం కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలలుగా క్రికెట్‌కు దూరంగా ఉన్న పంత్ మళ్లీ మైదానంలోకి రావడం ఇదే మొదటిసారి. ఆ కాసేపటికే 2 ఫోర్లు, 2 సిక్సులతో 25 బంతుల్లో 33 పరుగులు చేసిన షాయ్ హోప్‌ను 11వ ఓవర్‌లో మరో పేసర్ హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చాడు. అనంతరం రికీ భూయ్‌తో కలిసి జట్టు స్కోర్‌ను పంత్ 100 పరుగులు దాటించాడు. అయితే మరో సారి చెలరేగిన హర్షల్ పటేల్ 13వ ఓవర్‌లో రిషబ్ పంత్‌ను ఔట్ చేశాడు. 13 బంతులు ఎదుర్కొన్న పంత్ 2 ఫోర్లతో 18 పరుగులు చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే 3 పరుగులు చేసిన రికీ భుయ్‌ను హర్‌ప్రీత్ బ్రార్ పెవిలియన్ చేర్చాడు. దీంతో 111 పరుగులకే ఢిల్లీ సగం వికెట్లు కోల్పోయింది.
త్రిస్టన్ స్టబ్స్(5), సుమిత్ కుమార్(2) కూడా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. అయితే 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 13 బంతుల్లోనే 21 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. దీంతో 147 పరుగులకే ఢిల్లీ 8 వికెట్లు కోల్పోయింది. దీంతో ఢిల్లీ స్కోర్ 150 దాటితే అదే ఎక్కువ అనిపించింది. ఇలాంటి సమయంలో 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అభిషేక్ పోరెల్ చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 25 పరుగులు రాబట్టాడు. అభిషేక్ మెరుపులతో ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. 4 ఫోర్లు, 2 సిక్సులతో 10 బంతుల్లోనే 32 పరుగులు చేసిన అభిషేక్ నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్ రెండేసి వికెట్లు.. రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, రబాడ తలో వికెట్ తీశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.