Share News

IND vs ENG: టీమిండియా స్పిన్నర్ల ఖాతాలో అరుదైన రికార్డు.. గత 48 ఏళ్లలో ఇదే తొలిసారి..

ABN , Publish Date - Mar 08 , 2024 | 02:31 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో భారత స్పిన్నర్లు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐదో టెస్టు తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేశారు. భారత స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది.

IND vs ENG: టీమిండియా స్పిన్నర్ల ఖాతాలో అరుదైన రికార్డు.. గత 48 ఏళ్లలో ఇదే తొలిసారి..

ధర్మశాల: ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు తొలి రోజు ఆటలో భారత స్పిన్నర్లు అరుదైన రికార్డును నెలకొల్పారు. ఐదో టెస్టు తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్‌ను మొదటి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేశారు. భారత స్పిన్నర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ 10 వికెట్లను స్పిన్నర్లే తీయడం గమనార్హం. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు పడగొట్టగా.. రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీశాడు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. అయితే భారత స్పిన్నర్లు తొలి రోజు ఆటలోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం గత 48 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరగా 1976లో అక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు ఈ ఘనత సాధించారు. స్వదేశంలో అయితే చివరగా 1973లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఈ ఘనత సాధించారు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 376 పరుగులు చేసింది. క్రీజులో సర్ఫరాజ్ ఖాన్(56), దేవదత్ పడిక్కల్ (44) ఉన్నారు. దీంతో ఇంగ్లండ్‌పై ప్రస్తుతం భారత జట్టు 158 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు కెప్టెన్ రోహిత్ శర్మ(103), శుభ్‌మన్ గిల్(110) సెంచరీలతో చెలరేగారు. యశస్వీ జైస్వాల్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 02:42 PM