IND vs ENG: వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన యశస్వీ జైస్వాల్
ABN , Publish Date - Feb 24 , 2024 | 06:18 PM
టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్‌లో అత్యధికంగా 600కుపైగా పరుగులు సాధించాడు.
రాంచీ: టీమిండియా యువ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు సాధించిన జైస్వాల్ ఈ సిరీస్‌లో అత్యధికంగా 600కుపైగా పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో జైస్వాల్ సిక్సులను సునాయసంగా బాదేస్తున్నాడు. మూడో టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో అయితే ఏకంగా 12 సిక్సులు బాదేశాడు. ఆ ఇన్నింగ్స్‌లో ఏకంగా 12 సిక్సులు, 14 ఫోర్లు బాది డబుల్ సెంచరీతో వీర విహారం చేశాడు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో, ఈ క్యాలెండర్ ఇయర్‌లో 23 సిక్సులు బాదాడు. దీంతో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సులు బాదిన టీమిండియా బ్యాటర్‌గా యశస్వీ జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. నాలుగో టెస్ట్ మ్యాచ్ టీమిండియా మొదటి ఇన్నింగ్స్‌లో షోయబ్ బషీర్ వేసిన ఓవర్లో సిక్సు కొట్టడం ద్వారా జైస్వాల్ ఈ రికార్డును చేరుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 16 ఏళ్ల రికార్డును జైస్వాల్ బద్దలుకొట్టాడు. 2008లో సెహ్వాగ్ 22 సిక్సులు బాదాడు.
తాజాగా 23 సిక్సులతో సెహ్వాగ్ రికార్డును జైస్వాల్ అధిగమించాడు. ఈ సంవత్సరం తొలి రెండు నెలల్లోనే జైస్వాల్ ఈ రికార్డును చేరుకోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది జైస్వాల్ మరిన్ని సిక్సులు కొట్టనున్నాడు. 21 సిక్సులు కొట్టిన రిషబ్ పంత్, 20 సిక్సులు కొట్టిన రోహిత్ శర్మ, 18 సిక్సులు కొట్టిన మయాంక్ అగర్వాల్ ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అలాగే ఈ సిరీస్‌లో ఇప్పటికే 75 సిక్సులు నమైదయ్యాయి. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సులు నమోదైన సిరీస్‌గా భారత్ VSఇంగ్లండ్ సిరీస్ నిలిచింది. ఈ క్రమంలో 2023లో యాషెస్ సిరీస్‌లో నమోదైన 74 సిక్సుల రికార్డు ఈ సిరీస్ ద్వారా బద్దలైంది. ధృవ్ జురేల్ కొట్టిన సిక్సు ద్వారా ఈ రికార్డు బద్దలవడం గమనార్హం. అయితే భారత్ VSఇంగ్లండ్ మధ్య ఇంకా ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండడంతో ఈ సిరీస్‌లో మరికొన్ని సిక్సులు నమోదుకానున్నాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌లో 219/7 పరుగులు చేసింది. క్రీజులో ధృవ్ జురేల్(30), కుల్దీప్ యాదవ్(17) ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. దీంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 134 పరుగులు వెనుకబడి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.