Rohit Sharma: స్పెషల్ ట్రోఫీతో రోహిత్.. ఈ కప్ ఎందుకిచ్చారో తెలుసా..
ABN , Publish Date - Dec 01 , 2024 | 07:30 PM
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల్లోని ఓ కప్ గురించే ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు. అసలు హిట్‌మ్యాన్‌కు ఇచ్చిన ట్రోఫీ ఏంటని చర్చిస్తున్నారు. మరి.. ఆ కప్ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..
IND vs PM 11: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రావడం రావడమే తడాఖా చూపించాడు. కంగారూ గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి హిట్‌మ్యాన్ ఫుల్ బిజీ అయిపోయాడు. అతడు వచ్చీ రాగానే పెర్త్ టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్ నుంచి గ్రౌండ్‌లోకి వచ్చి మరీ జట్టు ఆటగాళ్లను అభినందించాడతను. తాను ఆడకపోయినా మిగతా ప్లేయర్లు కలసికట్టుగా అదరగొట్టిన తీరుకు, తాత్కాలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రా వాళ్లను నడిపించిన తీరుకు అతడు ఫిదా అయిపోయాడు. ఆ తర్వాత టీమ్ బాధ్యతలు చేపట్టిన రోహిత్.. అడిలైడ్ టెస్ట్ కోసం సహచరులను సిద్ధం చేస్తున్నాడు. అయితే సడన్‌గా చేతిలో ఓ ట్రోఫీతో దర్శనమిచ్చాడు హిట్‌మ్యాన్. దీంతో ఆ కప్ ఏంటని అంతా మాట్లాడుకుంటున్నారు. ఇదెప్పుడు గెలిచాడని ఆలోచనల్లో పడ్డారు. మరి.. ఈ ట్రోఫీ కథా కమామీషు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇచ్చింది అందుకే..
రోహిత్ శర్మ తాజాగా చేతిలో కప్పుతో దర్శనమిచ్చాడు. దీంతో ఈ ట్రోఫీ ఏంటని చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒక్క టెస్ట్ మాత్రమే జరిగింది.. ఇంకా మూడు టెస్టులు బాకీ ఉన్నాయి. అలాంటప్పుడు హిట్‌మ్యాన్‌కు ఎందుకు కప్ ఇచ్చారని ఆలోచిస్తున్నారు. అయితే రోహిత్‌కు ఇచ్చింది ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్ కప్. పింక్ బాల్ టెస్ట్‌కు ముందు ఆ జట్టుతో టీమిండియా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ఇందులో రోహిత్ సేన 5 వికెట్లతో నెగ్గడంతో ట్రోపీని ఇచ్చారు. దాన్ని అందుకునే సమయంలో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు భారత సారథి.
కప్పు బోనస్
ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో భారత్ మ్యాచ్ ఆడటం గురించి చాలా మందికి తెలియకపోవడంతో కన్‌ఫ్యూజ్ అయ్యారు. అయితే ఈ మ్యాచ్ గురించి తెలిసిన వాళ్లు కూడా షాక్ అవుతున్నారు. వార్మప్ మ్యాచ్‌కు ట్రోఫీ పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో గెలిచినా కప్ ఇస్తారా? అంటూ ఒకింత విస్మయానికి లోనవుతున్నారు. ఈ కల్చర్ బాగుంది.. దీన్నే ఫాలో అవండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్ మాత్రం భారత్‌కు బిగ్ ప్లస్ అయింది. ఈ మ్యాచ్‌లో అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు సత్తా చాటారు. బౌలింగ్‌లో హర్షిత్ రాణా 4 వికెట్లతో దుమ్మురేపాడు. బ్యాటింగ్‌లో గిల్ హాఫ్ సెంచరీ బాదాడు. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కూడా సెన్సిబుల్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్.. ఒకవైపు మంచి ప్రాక్టీస్, మరోవైపు గెలిచినందుకు కప్ కూడా ఇచ్చారు డబుల్ బోనస్ అని అభినందిస్తున్నారు.
Also Read:
ఆస్ట్రేలియాను చెడుగుడు ఆడేసిన నితీష్.. ఇదీ తెలుగోడి పవర్
టీమ్ కోసం భారీ త్యాగం.. కెప్టెన్ అంటే రోహిత్‌లా ఉండాలి
ఐసీసీ ఛైర్మన్‌గా జైషా బాధ్యతలు.. ఈ 5 సవాళ్లను దాటితేనే కింగ్ అనిపించుకునేది
కొడుకుకు నామకరణం చేసిన రోహిత్.. పేరు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
For Sports And Telugu News