IPL 2024: ధోని టీంపై కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు.. సీఎస్కేపై ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా..
ABN , Publish Date - Mar 19 , 2024 | 05:11 PM
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కు సమయం ఆసయన్నమైంది. మార్చి 22 నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభంకానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024కు సమయం ఆసయన్నమైంది. మార్చి 22 నుంచే ఈ మెగా లీగ్ ప్రారంభంకానుంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నైసూపర్ కింగ్స్‌తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. చెన్నైలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఒక పరుగు చేస్తే చెన్నైసూపర్ కింగ్స్‌పై 1,000 పరుగులను పూర్తి చేసుకోనున్నాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs చెన్నైసూపర్ కింగ్స్ మ్యాచ్‌ల్లో 1,000 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు. చెన్నైతో ఇప్పటివరకు 31 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన కోహ్లీ 37 సగటు, 125 స్ట్రైక్ రేట్‌తో 999 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 751 పరుగులు చేసిన ధోని, 710 పరుగులు చేసిన సురేష్ రైనా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
అలాగే మొత్తంగా చూసుకుంటే చెన్నైపై 1,000 పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు నెలకొల్పుతాడు. ఈ జాబితాలో 1,057 పరుగులు చేసిన శిఖర్ ధావన్ మొదటి స్థానంలో ఉన్నాడు. 29 ఇన్నింగ్స్‌ల్లో 44 సగటు, 131 స్ట్రైక్ రేటుతో ధావన్ ఈ పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 8 హాఫ్ సెంచరీలున్నాయి. ఆ తర్వాత 791 పరుగులు చేసిన రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ధోని టీంపై విరాట్ కోహ్లీని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.