Share News

Dhoni: ధోని న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ఓ లుక్కేయండి.. ఫ్యామిలీతోపాటు బాలీవుడ్ హీరోయిన్లు కూడా..

ABN , Publish Date - Jan 03 , 2024 | 04:30 PM

టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమే గడిచిపోయింది. కొన్నేళ్లుగా ధోని ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు.

Dhoni: ధోని న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై ఓ లుక్కేయండి.. ఫ్యామిలీతోపాటు బాలీవుడ్ హీరోయిన్లు కూడా..

టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలమే గడిచిపోయింది. కొన్నేళ్లుగా ధోని ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అయినప్పటికీ మహేంద్రుడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ కేవలం ధోని కోసమే అభిమానులు స్టేడియాలకు వస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లో ఇందుకు సాక్ష్యం. ధోని బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియం మొత్తం అతని నామస్మరణతో మార్మోగిపోయింది. సోషల్ మీడియాలోనూ ధోనికి భారీ ఫాలోయింగ్ ఉంది. ధోని గురించి ఏ చిన్న పోస్టు వచ్చిన సరే లైక్‌లు, కామెంట్లు, షేర్లతో సోషల్ మీడియాను అభిమానులు హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ధోని నూతన సంవత్సరం వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ప్రస్తుతం విహాయయాత్రలో భాగంగా కుటుంబంతో కలిసి దుబాయ్‌లో ఉన్న ధోని అక్కడే నూతన సంవత్సరం వేడుకలను జరుపుకున్నాడు. భార్య సాక్షి, కూతురు జీవాతో కలిసి ధోని కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నాడు. ఈ వేడుకల్లో బాలీవుడ్ హీరోయిన్లు క‌ృతి సనన్, నుపుర్ సనన్ కూడా పాల్గొన్నారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా వీరంతా కలిసి ఓ పార్టీలో పాల్గొన్నారు. ఆ వేడుకల్లో బాణాసంచా పేలుళ్లతోపాటు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో వారంతా కలిసి డిన్నర్ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ధోని సతీమణి సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఈ పోస్ట్ పెట్టింది. సోషల్ మీడియాలో వీడియోను చూసిన అభిమానులు ధోనికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతున్నారు.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 03 , 2024 | 04:30 PM