SRH vs GT: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఉప్పల్ మ్యాచ్‌పై ఎఫెక్ట్
ABN , Publish Date - May 16 , 2024 | 04:55 PM
ఐపీఎల్-2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా..
ఐపీఎల్-2024లో (IPL 2024) భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఇది 66వ మ్యాచ్. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. అయితే.. ఈ మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యే సమయంలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒకవేళ అదే జరిగితే.. ఈ మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్ ఉంది.
విమానంలో షాకింగ్ సీన్.. ఎయిర్ హోస్టెస్ బాత్రూంలోకి వెళ్లి చూస్తే..
కాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఈ మ్యాచ్ ఎంతో కీలకమైంది. ఇందులో గెలిస్తే.. అది ప్లేఆఫ్స్‌లో తన బెర్తుని ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైనా.. ఎస్ఆర్‌హెచ్‌కి పెద్ద నష్టమేమీ లేదు. ఇరుజట్లకీ చెరో పాయింట్ కేటాయిస్తారు కాబట్టి.. అప్పుడు హైదరాబాద్ ఖాతాలోకి 15 పాయింట్లు వచ్చినట్లు అవుతుంది. అప్పుడు కూడా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫమ్ అవుతుంది. ఒకవేళ మ్యాచ్ రద్దవ్వకుండా హైదరాబాద్ గెలిస్తే.. నెట్ రన్‌రేట్ మెరుగ్గా ఉంది కాబట్టి రెండో స్థానానికి ఎగబాకుతుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం, నాలుగో స్థానంలో ఉంటుంది. రన్‌రేట్ కూడా తేడా కొడుతుంది. అప్పుడు తదుపరి మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంటుంది.
Read Latest Sports News and Telugu News