Share News

Ravichandran Ashwin: అశ్విన్ అయిపోయాడు.. నెక్స్ట్ వాళ్లే.. రోహిత్ రప్పా రప్పా..

ABN , Publish Date - Dec 18 , 2024 | 02:39 PM

Ravichandran Ashwin: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్‌తో నెక్స్ట్ వేటు ఎవరిపై అనేది చర్చనీయాంశంగా మారింది.

Ravichandran Ashwin: అశ్విన్ అయిపోయాడు.. నెక్స్ట్ వాళ్లే.. రోహిత్ రప్పా రప్పా..
Rohit Sharma

IND vs AUS: టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు అతడు గుడ్‌బై చెప్పేశాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. అయితే అశ్విన్ రిటైర్మెంట్ వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ఉందని వినిపిస్తోంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వేసిన బాటలో హిట్‌మ్యాన్ నడుస్తున్నాడని.. అందులో భాగంగానే అశ్విన్‌ను తొలుత పంపేశాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


అప్పుడు ధోని.. ఇప్పుడు రోహిత్

వన్డే ప్రపంచ కప్-2011 తర్వాత భారత జట్టులో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. వీరేంద్ర సెహ్వాగ్ నుంచి సచిన్ టెండూల్కర్ వరకు మూడ్నాలుగేళ్ల గ్యాప్‌లో సీనియర్ ప్లేయర్లంతా రిటైర్మెంట్ ప్రకటించారు. పలువురు సీనియర్లకు అవకాశాలు ఇవ్వకపోవడం, ఫిట్‌నెస్-అధిక బరువు కారణాలు చూపడం, ఫెయిలైతే పక్కనబెట్టడం లాంటివి జరిగాయి. ధోనీతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్, సెలెక్టర్లు పక్కా ప్లానింగ్‌తోనే ఇలా చేశారని.. దీంతో దిగ్గజాల నిష్క్రమణ తప్పలేదని అప్పట్లో మాజీ క్రికెటర్లు, అనలిస్టులు అన్నారు. ఇప్పుడు భారత జట్టులో పరిణామాలు కూడా గతాన్ని తలపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇదే చివరి సిరీస్..

ధోని బాటలో రోహిత్ నడుస్తున్నాడని.. అందులో భాగంగానే అశ్విన్‌పై మొదట వేటు పడిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. నెక్స్ట్ రవీంద్ర జడేజా, ఆ తర్వాత విరాట్ కోహ్లీని టార్గెట్ చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. హిట్‌మ్యాన్ మరికొన్నేళ్లు కొనసాగొచ్చని.. ఒకవేళ ఇలాగే ఫెయిలైతే బీసీసీఐ పెద్దలు అతడి భవితవ్యం మీదా కఠిన నిర్ణయం తీసుకోక తప్పదని వినిపిస్తోంది. కోహ్లీ, జడ్డూలకు ఆసీస్‌తో సిరీస్‌ టెస్టుల్లో ఆఖరిదిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. రాణిస్తే జట్టులో చోటు.. లేదంటే రిటైర్మెంట్ ఖాయమనే మెసేజ్‌ను సీనియర్లకు హిట్‌మ్యాన్ ఇచ్చాడని సమాచారం.


Also Read:

అశ్విన్‌ రిటైర్మెంట్‌తో తప్పించుకున్న ముగ్గురు స్టార్లు సేఫ్

అశ్విన్‌పై కుట్ర.. పక్కా ప్లానింగ్‌తో సైడ్ చేసేశారు

రిటైర్మెంట్ ఇచ్చినా బేఫికర్.. పెన్షన్‌తో పాటు అశ్విన్‌కు ఫుల్ బెనిఫిట్స్

For More Sports And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 02:48 PM