Rohit-Virat: టీమిండియాకు విలన్లుగా రోహిత్-కోహ్లీ.. ఆ ఒక్క తప్పుతో..
ABN , Publish Date - Nov 03 , 2024 | 05:56 PM
Rohit-Virat: కోచ్ గంభీర్ వ్యూహాలు ఫలించలేదు. రోహిత్ స్ట్రాటజీలు వర్కౌట్ కాలేదు. కోహ్లీ సీనియారిటీ కూడా కాపాడలేదు. న్యూజిలాండ్ చేతుల్లో భారత్‌కు మరో పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ ఓటములతో సొంతగడ్డపై వైట్‌వాష్ అయింది మెన్ ఇన్ బ్లూ.
IND vs NZ: కోచ్ గంభీర్ వ్యూహాలు ఫలించలేదు. కెప్టెన్ రోహిత్ స్ట్రాటజీలు వర్కౌట్ కాలేదు. కోహ్లీ సీనియారిటీ కూడా కాపాడలేదు. న్యూజిలాండ్ చేతుల్లో భారత్‌కు మరో పరాభవం ఎదురైంది. హ్యాట్రిక్ ఓటములతో సొంతగడ్డపై వైట్‌వాష్ అయింది మెన్ ఇన్ బ్లూ. ముంబై వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్‌లో 25 పరుగుల తేడాతో పరాజయం పాలైంది రోహిత్ సేన. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 0-3తో అవమానకర రీతిలో కోల్పోయింది. పులుల్లా చెలరేగుతూ సొంతగడ్డపై ఎదురొచ్చిన ప్రతి జట్టును చిత్తుగా ఓడించే టీమిండియా.. ఇలా పసికూన మాదిరిగా ఆడటంతో అంతా షాక్ అవుతున్నారు. అసలు మన జట్టుకు ఏమైందని అంటున్నారు. కొందరైతే రోహిత్, కోహ్లీనే భారత్‌ను ఓడించారని అంటున్నారు. దీనికి సాలిడ్ రీజన్ కూడా చెబుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఆ టోర్నీలో ఆడకపోవడం తప్పు
నేషనల్ డ్యూటీ లేనప్పుడు ప్రతి ఆటగాడు డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడాల్సిందేనని ఇటీవల బీసీసీఐ ఓ రూల్ తీసుకొచ్చింది. దులీప్ ట్రోఫీ-2024 నుంచి దీన్ని అమల్లో పెట్టింది. అయితే దాదాపుగా అందరు ప్లేయర్లు ఈ టోర్నీలో ఆడినా రోహిత్, కోహ్లీ, బుమ్రా, అశ్విన్, జడేజా లాంటి సీనియర్లు మాత్రం పాల్గొనలేదు. సీనియర్లు కావడం, వాళ్లకు రెస్ట్ ఇస్తే బెటర్ అనే ఉద్దేశంతో బోర్డు కూడా ఏమీ అనలేదు. కానీ పిచ్‌లను అంచనా వేయడం, ఫామ్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడంతో పాటు స్పిన్‌ను ఆడటంలో బెటర్ అవడానికి ఈ టోర్నీ ఉపయోగపడేది. ఈ ఛాన్స్‌ను రోహిత్, కోహ్లీ చేజేతులా వదులుకున్నారు.
ఇకనైనా మారాలి
బంగ్లాదేశ్ సిరీస్‌లో ఏదోలా నెట్టుకొచ్చిన టీమిండియా న్యూజిలాండ్ సిరీస్‌లో పూర్తిగా తడబడింది. అజాజ్ పటేల్, శాంట్నర్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లను సరిగ్గా ఎదుర్కోలేక కోహ్లీతో పాటు ఇతర స్టార్లు బ్యాట్లెత్తేశారు. అదే దులీప్ ట్రోఫీలో ఆడి ఉంటే మంచి ప్రాక్టీస్ అయ్యేది, స్వదేశీ పిచ్‌లపై మరింత అవగాహన వచ్చేది, ఈ ఓటములు, అవమానాలు తప్పేవని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. అప్పట్లో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్ లాంటి వాళ్లు దేశవాళీ క్రికెట్‌లో విరివిగా ఆడుతూ తమ టెక్నిక్, స్కిల్స్‌ను మెరుగుపర్చుకొని ఆ స్థాయికి చేరుకున్నారని గుర్తుచేస్తున్నారు. దులీప్ ట్రోఫీలో ఆడకుండా కోహ్లీ, హిట్‌మ్యాన్ సహా అశ్విన్, జడేజా లాంటి సీనియర్లు చేసిన తప్పిదం జట్టు వరుస ఓటములకు ప్రధాన కారణమని కామెంట్స్ చేస్తున్నారు. ఇకనైనా డొమెస్టిక్ క్రికెట్ ఆడటం మీద ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.
Also Read:
తప్పు నాదే.. ఒప్పుకుంటున్నా: రోహిత్ శర్మ
ముంబై టెస్ట్‌లో భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు
8వ నెంబర్‌లో ఎందుకు?
For More Sports And Telugu News: