Rohit Sharma: ఇష్టం లేకపోయినా టీమ్ కోసమే ఆ పని చేస్తున్నా: రోహిత్ శర్మ
ABN , Publish Date - Dec 05 , 2024 | 05:23 PM
Rohit Sharma: టీమ్ కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని అంటుంటాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఎన్నోమార్లు ఇది చేసి చూపించాడు కూడా. జట్టు కోసం ఏ త్యాగం చేసేందుకైనా అతడు సిద్ధంగా ఉంటాడు.
IND vs AUS: టీమ్ కంటే తనకు ఏదీ ఎక్కువ కాదని అంటుంటాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఎన్నోమార్లు ఇది చేసి చూపించాడు కూడా. జట్టు కోసం ఏ త్యాగం చేసేందుకైనా అతడు సిద్ధంగా ఉంటాడు. టీమ్ బెనిఫిట్స్ తప్పితే మిగతావి హిట్‌మ్యాన్ పట్టించుకోడు. రికార్డులు, మైల్‌స్టోన్స్ కంటే జట్టు గెలుపే లక్ష్యంగా అతడు ఆడుతుంటాడు. తను ఆడటమే కాదు.. టీమ్‌లోని ఇతర ప్లేయర్లను కూడా ఇదేరీతిలో ఆడిస్తుంటాడు. అందుకే స్వార్థం లేని సారథిగా రోహిత్ గుర్తింపు సంపాదించాడు. అలాంటోడు టీమ్ కోసం మళ్లీ త్యాగం చేసేందుకు రెడీ అయిపోయాడు.
అటు రోహిత్.. ఇటు రాహుల్
పెర్త్ టెస్ట్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా.. ఇప్పుడు రెండో ఛాలెంజ్‌కు రెడీ అవుతోంది. అడిలైడ్ వేదికగా శుక్రవారం నుంచి మొదలవనున్న పింక్ బాల్ టెస్ట్‌లో కంగారూల పని పట్టాలని చూస్తోంది. తొలి టెస్ట్‌కు దూరమైన సారథి రోహిత్ తిరిగి జట్టులో కలిశాడు. టీమ్ పగ్గాలు చేపట్టిన హిట్‌మ్యాన్.. రెండో టెస్ట్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చడం తనకు ఇష్టం ఉండదని.. కానీ ఈసారి తప్పట్లేదని అన్నాడు. తాను రెగ్యులర్‌గా ఆడే ఓపెనింగ్ పొజిషన్‌లో కేఎల్ రాహుల్ ఆడతాడని.. తాను మిడిలార్డర్‌కు మారుతున్నానని క్లారిటీ ఇచ్చాడు.
కష్టమే.. కానీ!
‘కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడు. మిడిలార్డర్‌లో ఏదో ఒక ప్లేస్‌లో నేను ఆడతా. ఒక బ్యాటర్‌గా ఇది నాకు అంత సులువు కాదని తెలుసు. కానీ తప్పట్లేదు. టీమ్‌కు ఇదే బెస్ట్ ఆప్షన్. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నా. జట్టు గెలుపు కోసం ఏం చేయడానికైనా రెడీ. తొలి టెస్ట్‌లో జైస్వాల్-రాహుల్ సూపర్బ్‌గా బ్యాటింగ్ చేశారు. ఆ టైమ్‌లో నేను నా చిన్నారిని చేతుల్లో ఎత్తుకొని మ్యాచ్ చూస్తున్నా. రాహుల్ బ్యాటింగ్‌ను గమనించా. అతడి ఆట చాలా బాగుంది. బ్యాటింగ్ ఆర్డర్‌ను డిస్ట్రబ్ చేయొద్దని అనిపించింది. అందుకే కష్టమైనా ఫర్లేదని.. నేను మిడిలార్డర్‌కు మారుతున్నా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఫ్యూచర్ గురించి ఏమీ చెప్పలేనని.. సిచ్యువేషన్‌ను బట్టి నిర్ణయాలు మారుతూ ఉంటాయన్నాడు హిట్‌మ్యాన్.
Also Read:
భువనేశ్వర్ సెన్సేషనల్ స్పెల్.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ ఎమోషనల్
అక్షర్ పటేల్ మాస్ బ్యాటింగ్.. వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకుతెచ్చేలా..
భయపెడుతున్న ఆడిలైడ్ పిచ్ హిస్టరీ.. ఎవ్వరికైనా అదే రిజల్టా..
For More Sports And Telugu News