Rohit Sharma: నెక్స్ట్ ఎవరు.. రిటైర్మెంట్‌పై ప్రశ్న.. రోహిత్ దిమ్మతిరిగే ఆన్సర్
ABN , Publish Date - Dec 19 , 2024 | 11:43 AM
Rohit Sharma: వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌తో కొత్త చర్చలు ఊపందుకున్నాయి. టీమిండియాలో నెక్స్ట్ ఎవరు రిటైర్ అవుతారనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి.
వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్‌తో కొత్త చర్చలు ఊపందుకున్నాయి. టీమిండియాలో నెక్స్ట్ ఎవరు రిటైర్ అవుతారనే డిస్కషన్స్ ఊపందుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుత భారత టెస్ట్ టీమ్‌లో ఉన్న సీనియర్లు. దీంతో అశ్విన్ తర్వాత పడే వికెట్ ఎవరిదా? అనే చర్చలు సాగుతున్నాయి. జడేజా బాల్‌తో మునుపటిలా ప్రభావం చూపలేకపోవడం, కోహ్లీ మూడ్నాలుగేళ్లుగా దారుణ ఫామ్‌లో ఉండటం, హిట్‌మ్యాన్ బ్యాట్ గర్జించక ఏళ్లు గడుస్తుండటంతో ఎవరు పక్కకు జరుగుతారా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. దీనిపై రోహిత్ స్పందించాడు.
సర్‌ప్రైజ్‌లు ఉంటాయా?
అశ్విన్ రిటైర్మెంట్ నేపథ్యంలో టీమ్ నుంచి ఇంకేమైనా సర్‌ప్రైజ్‌లు ఉంటాయా? అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్‌కు ఓ విలేకరి నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి అతడు తనదైన రీతిలో అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు. అశ్విన్ ఒక్కడిదే రిటైర్మెంట్ అని.. ఇతరులు ఎవరూ ఆ ఆలోచనల్లో లేరన్నాడు. తాను క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నానని అన్నాడు. పరుగులు ముఖ్యం కాదని.. గేమ్‌ను ఎంజాయ్ చేయడమే కీలకమని చెప్పాడు. పరుగుల కంటే కూడా ప్లేయర్లు ఎలాంటి మైండ్‌సెట్‌తో ఉన్నారనేది ఇంపార్టెంట్ అని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు.
కుండబద్దలు కొట్టేశాడు
టెస్టుల్లో కోహ్లీ-రోహిత్ చాన్నాళ్లుగా ఫెయిల్ అవుతూ వస్తున్నారు. వాళ్లిద్దరి బ్యాట్ నుంచి పరుగుల వర్షం ఎప్పుడో ఆగిపోయింది. సెంచరీల సంగతి పక్కనబెడితే.. డబుల్ డిజిట్ టచ్ చేయడమే కష్టంగా మారింది. జడేజా కూడా ఒకప్పటిలా బంతితో, బ్యాట్‌తో పూర్తి స్థాయిలో రాణించడం లేదు. అయితే వరుస పరాజయాలు ఎదురవుతున్నా, వయసు మీద పడినా, ఫెయిల్యూర్స్ కంటిన్యూ అవుతున్నా వీళ్లు రిటైర్మెంట్ ప్రస్తావన తీసుకురావడం లేదు. కానీ అశ్విన్ నిష్క్రమణతో వీళ్ల రిటైర్మెంట్‌పై కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఎవరూ రిటైర్ కాబోవడం లేదని హిట్‌మ్యాన్ క్లారిటీ ఇచ్చేశాడు. తాను మరిన్ని రోజులు ఆడనున్నట్లు కుండబద్దలు కొట్టేశాడు. హిట్‌మ్యాన్ స్పష్టత ఇచ్చేయడంతో ఇక ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడటం ఖాయం.
Also Read:
రిటైర్మెంట్‌పై ట్విస్ట్ ఇచ్చిన అశ్విన్.. ఇలా అనేశాడేంటి
అశ్విన్‌కు కమిన్స్ స్పెషల్ గిఫ్ట్.. మనసులు గెలిచిన ఆసీస్ కెప్టెన్
రిటైర్మెంట్‌కిదా సమయం: సన్నీ
నాడు ధోనీ.. నేడు అశ్విన్
For More Sports And Telugu News