Rohit Sharma: తప్పు నాదే.. ఒప్పుకుంటున్నా: రోహిత్ శర్మ
ABN , Publish Date - Nov 03 , 2024 | 04:27 PM
Rohit Sharma: టీమిండియా మరో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతుల్లో ఆఖరి టెస్ట్‌లోనూ ఓడి వైట్‌వాష్ అయింది. ఈ నేపథ్యంలో జట్టు సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తప్పంతా తనదేనని అన్నాడు.
IND vs NZ: టీమిండియా మరో అవమానకర ఓటమిని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ చేతుల్లో ఆఖరి టెస్ట్‌లోనూ ఓడి వైట్‌వాష్ అయింది. సొంతగడ్డపై పులుల్లా చెలరేగి ఆడే భారత ఆటగాళ్లు కివీస్ జోరు ముందు నిలబడలేకపోయారు. ప్రత్యర్థి బిగించిన స్పిన్ ఉచ్చులో పడి సిరీస్‌ను కోల్పోవడమే గాక క్లీన్‌స్వీప్ కూడా అయి అభిమానులను తీవ్రంగా నిరుత్సాహపర్చారు. మూడు టెస్టుల సిరీస్‌లో ఆల్రెడీ రెండు మ్యాచుల్లో ఓడిన మెన్ ఇన్ బ్లూ.. చివరి మ్యాచ్‌లోనైనా నెగ్గుతారనుకుంటే అందులోనూ ఓడటం బిగ్ షాక్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో జట్టు సారథి రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తప్పంతా తనదేనని అన్నాడు.
నాదే బాధ్యత
ముంబై టెస్ట్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఓటమికి కెప్టెన్‌గా తనదే బాధ్యత అని అన్నాడు. సారథిగా, బ్యాటర్‌గా తాను బెస్ట్ ఇవ్వలేకపోయానని చెప్పాడు. సిరీస్ ఆరంభం నుంచి నిర్ణయాలు తీసుకోవడంలోనూ, వ్యూహాలు పన్నడంలో కొన్ని తప్పిదాలు జరిగాయని హిట్‌మ్యాన్ ఒప్పుకున్నాడు. దాని వల్లే సిరీస్‌ను కోల్పోయామని తెలిపాడు.
కెరీర్‌లో ఇదే ఫస్ట్ టైమ్
‘జీవితంలో ఏదీ అంత ఈజీ కాదు. ప్రతిదీ సవాల్‌తో కూడుకున్నదే. ఒక్కో రోజ ఒక్కోలా ఉంటుంది. ఈ విషయాలను చిన్నతనంలోనే నేర్చుకున్నా. ఎత్తుపల్లాలు రావడం సహజమే. ఓటమి నుంచి నేర్చుకొని ముందుకెళ్లడం అలవర్చుకున్నా. నా కెరీర్‌లో ఇంత దారుణంగా ఎప్పుడూ ఆడలేదు. సొంతగడ్డపై వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. దీనికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నా’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఆ తప్పే ముంచింది
ఒక జట్టుగా తామంతా విఫలమయ్యామని పేర్కొన్నాడు. తాము అనుకున్న ప్లాన్స్ సరిగ్గా వర్కౌట్ కాకపోవడం ప్రతికూలంగా మారిందన్నాడు. సిరీస్ ఓపెనింగ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన బెంగళూరులో టాస్ నెగ్గాక బ్యాటింగ్ చేయాలని అనుకోవడం పెద్ద తప్పిదమన్నాడు హిట్‌మ్యాన్. సిరీస్ కోల్పోవడానికి అది బిగ్ రీజన్ అని చెప్పాడు. ఈ సిరీస్‌లో ఏదీ తాము అనుకున్నట్లు జరగలేదన్నాడు. కొన్ని స్ట్రాటజీలు తాము అనుకున్న విధంగా అమలు పర్చలేకపోయామన్నాడు రోహిత్.
Also Read:
ముంబై టెస్ట్‌లో భారత్ ఓటమికి 3 ప్రధాన కారణాలు
ఒకే ఓవర్‌లో 37 పరుగులు
పొరపాటు పోస్ట్‌కు రవిశాస్త్రి సారీ!
For More Sports And Telugu News