Rohit-Jaiswal: జైస్వాల్‌పై రోహిత్ సీరియస్.. ఎందుకిలా చేశావ్ అంటూ..
ABN , Publish Date - Dec 03 , 2024 | 04:53 PM
Rohit-Jaiswal: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. అలాంటోడు ఓ యంగ్ ప్లేయర్‌పై సీరియస్ అయ్యాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పుడూ కూల్‌గా, కామ్‌గా ఉంటాడు. అందరితో చనువుగా ఉంటూ తన చుట్టూ వాతావరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. సీనియర్లు, జూనియర్లు అనే తేడాల్లేకుండా జట్టులోని అందరితో కలసిపోతాడు. కెప్టెన్ కాబట్టి అందరితో మంచి రిలేషన్స్ మెయింటెయిన్ చేయక తప్పదు. అయినా సారథ్యంతో సంబంధం లేకుండా అందర్నీ కలుపుకుపోవడం మొదట్నుంచి హిట్‌మ్యాన్‌కు అలవాటు. నవ్వుతూ, నవ్విస్తూ చిల్‌గా ఉండే అతడు.. తాజాగా ఓ యంగ్ ప్లేయర్‌పై సీరియస్ అయ్యాడు. ఎందుకిలా చేశావంటూ తిట్టేశాడు. రోహిత్ సీరియస్ అవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూద్దాం..
ఎరక్కపోయి ఇరుక్కున్నాడు
ఓపెనర్ యశస్వి జైస్వాల్ మీద రోహిత్ సీరియస్ అయ్యాడు. ఎందుకు ఆ పని చేశావంటూ తిట్టేశాడు. ఈ ఘటన ఎయిర్‌పోర్ట్‌లో చోటుచేసుకుంది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత జట్టు.. ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో మ్యాచ్ ముగిశాక పింక్ బాల్ టెస్ట్ కోసం అడిలైడ్‌కు పయనమైంది. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే టీమ్ సభ్యులు బస్‌లో ఎక్కి హోటల్‌కు చేరుకున్నారు. అయితే విమానాశ్రయంలో ఓ తమాషా సంఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వచ్చే క్రమంలో ఒక చోట జైస్వాల్ ఇరుక్కుపోయాడు. అక్కడి నుంచి ఎలా బయటపడాలో తెలియక టెన్షన్ పడ్డాడు.
గిల్‌ను అడ్డుకున్న రోహిత్
జట్టు ఆటగాళ్లంతా కలసికట్టుగా ఒక రూట్ నుంచి బయటకు రాగా.. జైస్వాల్ మాత్రం ఎయిర్‌పోర్ట్ లోపలి వైపు ఇరుక్కున్నాడు. దీన్ని గమనించిన మరో యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ నవ్వుల్లో మునిగిపోయాడు. ఇది చూసిన రోహిత్.. అసలు అక్కడికి ఎందుకు వెళ్లావంటూ సీరియస్ అయ్యాడు. నో ఎంట్రీ అని ఉన్నా ఎందుకు అక్కడి నుంచే రావాలనుకున్నావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. జైస్వాల్ బయటకు రావాలంటే బయటి నుంచి డోర్స్ తెరవాలి. దీంతో తెరుస్తానంటూ గిల్ వెళ్లేందుకు ప్రయత్నించగా రోహిత్ అడ్డుకున్నాడు. ఏం అక్కర్లేదు.. అక్కడే ఉండనివ్వు అంటూ వెనక్కి పిలిచాడు. అయితే ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి తిరిగి జట్టుతో కలిశాడు జైస్వాల్. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ పాపం జైస్వాల్ అని కామెంట్స్ చేస్తున్నారు. పోయి పోయి.. కెప్టెన్‌కే దొరికిపోయావ్ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read:
భార్య సాక్షితో కలసి ధోని డ్యాన్స్.. స్టెప్స్ మామూలుగా లేవుగా..
దూబె-సూర్య సిక్సుల మోత.. బౌలర్లకు నరకం చూపించారు
ఈ క్యాప్ విలువ 2 కోట్లు.. సచిన్, కోహ్లీది కాదు.. ఏ ప్లేయర్‌దో చెప్పండి చూద్దాం
For More Sports And Telugu News