Share News

Shubman Gill: గిల్ క్లాస్ బ్యాటింగ్.. ఇది శానా యేండ్లు యాదుంటది

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:29 PM

Shubman Gill: టీమిండియా యంగ్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ తన సత్తా ఏంటో మరోమారు నిరూపించాడు. స్టార్లంతా ఫెయిలైన చోట బ్యాట్ అడ్డుపెట్టి నిలబడ్డాడు. న్యూజిలాండ్ బౌలర్లను క్లాస్ బ్యాటింగ్‌తో భయపెట్టాడు.

Shubman Gill: గిల్ క్లాస్ బ్యాటింగ్..  ఇది శానా యేండ్లు యాదుంటది

IND vs NZ: టీమిండియా యువ తరంగం శుబ్‌మన్ గిల్ తన బ్యాట్ సత్తా ఏంటో మరోమారు చూపించాడు. మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ బ్యాటర్లు ఫెయిలైనా.. గిల్ మాత్రం అదరగొట్టాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ భారత్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కివీస్ బౌలర్లను భయపెట్టాడు. సాలిడ్ డిఫెన్స్ టెక్నిక్‌తో ప్రత్యర్థి ఆటగాళ్ల సహనానికి పరీక్ష పెట్టాడీ యంగ్ గన్. ఒకవైపు రిషబ్ పంత్ (60) భారీ షాట్లతో విరుచుకుపడగా.. మరోవైపు గిల్ (146 బంతుల్లో 90) కూల్‌గా ఆడుతూ పోయాడు. మొదట్లో డిఫెన్స్ చేసినా ఆ తర్వాత షాట్లు కొట్టేందుకు వెనుకాడలేదు.


ఆఖరి వరకు పోరాటం

వాంఖడే టెస్ట్‌లో గిల్ తన క్లాస్ ఏంటో చూపించాడు. 84 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమ్‌ను కాపాడాడు. పంత్‌తో కలసి ఐదో వికెట్‌కు 96 పరుగులు జోడించాడు. ఆ తర్వాత అతడు ఔట్ అయినా గిల్ మాత్రం తన పని తాను చేసుకుపోయాడు. ఆఖరి వరకు బ్యాటింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. కొద్దిలో సెంచరీ మిస్ అయ్యాడు. గిల్-పంత్ గనుక ఆడకపోయి ఉంటే భారత్ ఎప్పుడో చాప చుట్టేసేది.


స్తంభంలా నిలబడ్డాడు

గిల్ ఒక ఎండ్‌లో స్తంభంలా నిలబడటంతో పంత్ టెన్షన్ లేకుండా ఆడాడు. స్వేచ్ఛగా తన స్టైల్‌లో భీకర షాట్లు బాదుతూ పోయాడు. తాను ఔట్ అయినా శుబ్‌మన్ చూసుకుంటాడనే ధీమా వల్లే రిషబ్ చెలరేగిపోయాడు. కాబట్టి అతడి నాక్ విషయంలోనూ గిల్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇద్దరూ జూనియర్ క్రికెట్‌లో కలసి ఆడటం, ఒకరి ఆట మీద మరొకరికి అవగాహన ఉండటంతో పరిస్థితులకు తగ్గట్లు బ్యాటింగ్ చేశారు. ప్రస్తుతం భారత్ 59.3 ఓవర్లకు 9 వికెట్ల నష్టానికి 262 పరుగులతో ఉంది. ఆధిక్యం 27 పరుగులకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ను ఎంత తక్కువ స్కోరుకు కట్టడి చేస్తామనే దాని మీదే రోహిత్ సేన విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.


Also Read:

ఇలా జరుగుతుందని అనుకోలేదు.. అంతా తారుమారు: జడేజా

చరిత్ర సృష్టించిన పంత్.. ఇది మామూలు ఫీట్ కాదు

భారత టూర్‌కు సఫారీ సైన్యమిదే!

For More Sports And Telugu News

Updated Date - Nov 02 , 2024 | 01:34 PM