Share News

Dinesh Karthik: టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేశ్ కార్తిక్.. ఫక్కున నవ్వేసిన పఠాన్!

ABN , Publish Date - Apr 16 , 2024 | 06:22 PM

టీ20 వరల్డ్‌కప్ సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది? ప్లేయింగ్ XIలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ కన్ఫమ్ అయ్యాడు కానీ, ఇతర ఆటగాళ్లే విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు.

Dinesh Karthik: టీ20 వరల్డ్‌కప్ జట్టులో దినేశ్ కార్తిక్.. ఫక్కున నవ్వేసిన పఠాన్!

టీ20 వరల్డ్‌కప్ (T20 World Cup) సమీపిస్తున్న తరుణంలో.. భారత జట్టులో ఎవరికి స్థానం దక్కుతుంది? ప్లేయింగ్ XIలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లెవరు? అనేది చర్చనీయాంశం అవుతోంది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Rohit Sharma) కన్ఫమ్ అయ్యాడు కానీ, ఇతర ఆటగాళ్లే విషయంలోనే ఎలాంటి క్లారిటీ లేదు. ఇదే సమయంలో.. ఐపీఎల్-2024లో జూనియర్లతో పాటు సీనియర్లు సైతం చెలరేగి ఆడుతుండటంతో.. ఆటగాళ్ల ఎంపిక అనేది మరింత కన్ఫ్యూజన్‌గా మారింది. ఈ క్రమంలోనే.. కొందరు మాజీలు, సీనియర్లు తమతమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు. ఫలానా ఆటగాడ్ని తీసుకుంటే.. వరల్డ్‌కప్‌లో తప్పకుండా ఇంపాక్ట్ చూపిస్తాడని భావిస్తున్నారు. అలా సిఫార్సు చేస్తున్న ఆటగాళ్లలో దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

దయచేసి ఆర్సీబీని అమ్మిపారేయండి.. టెన్నిస్ దిగ్గజం తీవ్ర అసహనం

ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభం నుంచే దినేశ్ కార్తిక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. తనకు అవకాశం దొరికినప్పుడల్లా భారీ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నాడు. మరీ ముఖ్యంగా.. సోమవారం బెంగళూరు వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (Sunrisers Hyderabad) జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 288 ప‌రుగుల భారీ ల‌క్ష్య చేధ‌న‌లో అతను అద్బుత‌మైన పోరాట ప‌టిమ క‌న‌బ‌రిచాడు. ఓ ద‌శ‌లో మ్యాచ్‌ను ఫినిష్ చేసేలా కనిపించాడు. కానీ.. న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఔట‌య్యాడు. ఈ మ్యాచ్‌లో దినేశ్ కేవలం 35 బంతుల్లోనే 5 ఫోర్లు, 7 సిక్స్‌ల సహకారంతో 83 పరుగులు చేశాడు. అతడు ఔటయ్యి, పెవిలియన్‌కి వెళ్తున్న క్రమంలో.. మైదానంలో ఉన్న అభిమానులందరూ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. దీన్ని బట్టి.. దినేశ్ ఆట ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్‌గా ఈ సీజ‌న్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన కార్తీక్ 226 ప‌రుగులు చేశాడు.

మా బ్రదర్స్‌ను చంపాలని చూస్తున్నారు.. అక్బరుద్దీన్ సంచలనం!


ఈ తరుణంలోనే.. దినేశ్‌కి టీ20 వరల్డ్‌కప్ జట్టులో చోటు ఇవ్వాలని మాజీలు అభిప్రాయపడుతున్నారు. ఈ జాబితాలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) చేరాడు. దినేశ్‌ని టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడించాల‌ని అన్నాడు. ‘‘దినేశ్ తన కెరీర్‌లో ఎక్కువగా ధోనీతో పోటీ పట్టాడు. ధోని కెప్టెన్‌గా, రెగ్యూల‌ర్ వికెట్ కీప‌ర్‌గా జ‌ట్టులో ఉండ‌డంతో.. దినేశ్‌కి పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే.. ఇప్పుడతను ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. అతనికి త‌న‌ కెరీర్‌లో చివ‌రిసారిగా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడే అవ‌కాశం ద‌క్కుతుంద‌ని నేను భావిస్తున్నాను. అతనికి ఛాన్స్ ఇస్తే, టీమిండియాకు మ్యాచ్ విన్నర్‌గా మారే ఛాన్సుంది. తన కెరీర్‌ని ఘనంగా ముగించేందుకు డీకేకి ఇదే సువర్ణవకాశం. కాబట్టి.. డీకేని వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఎంపిక చేయాల‌ని సెల‌క్టర్లను కోరుతున్నా’’ అని రాయుడు స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.

టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్ పాండ్యాకు నో ఛాన్స్.. కారణం ఇదే?

అయితే.. అదే షోలో పాల్గొన్న భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) మాత్రం రాయుడు అభిప్రాయాన్ని వ్యతిరేకించాడు. తొలుత రాయుడు వ్యాఖ్యలకు ఫక్కున నవ్వేసిన పఠాన్.. ఆ తర్వాత నవ్వుతూనే ఐపీఎల్ వేరు, వ‌ర‌ల్డ్‌క‌ప్ వేరు అని పేర్కొన్నాడు. అఫ్‌కోర్స్.. దినేశ్ కార్తిక్ మంచి ఫామ్‌లో ఉన్నాడన్న మాట వాస్తవమే కానీ, వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఎందుకంటే అక్కడ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ రూల్ ఉండ‌ద‌ని అన్నాడు. దినేశ్ స్థానంలో తాను రిషభ్ పంత్, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్లను ఎంపిక చేస్తానని చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 16 , 2024 | 06:22 PM