Share News

U19 World Cup: ఫైనల్ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌తో మ్యాచ్

ABN , Publish Date - Feb 11 , 2024 | 01:15 PM

భారత్‌తో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా ఫీల్డింగ్ చేయనుంది.

U19 World Cup: ఫైనల్ పోరులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. భారత్‌తో మ్యాచ్

బెనోని: భారత్‌తో జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత జట్టు ముందుగా ఫీల్డింగ్ చేయనుంది. అండర్ 19 ప్రపంచకప్‌లో వరుసగా ఐదో సారి ఫైనల్ చేరిన భారత జట్టు తుది సమరంలో నెగ్గి ఆరోసారి ట్రోఫి నెగ్గాలని పట్టుదలగా ఉంది. ఆసీస్ కూడా ఫైనల్ పోరులో నెగ్గి నాలుగో సారి కప్ గెలవాలని భావిస్తోంది. టోర్నీలో రెండు జట్లు ఒక మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరాయి. అండర్ 19 ప్రపంచకప్‌లో రెండు జట్లు ఇప్పటివరకు 3 సార్లు తలపడ్డాయి. 2012, 2018లో కంగారులను ఓడించి ట్రోఫిని ముద్దాడిన భారత్ ఒకసారి మాత్రం ఓడిపోయింది. కాగా గత నవంబర్‌లో జరిగిన సీనియర్ వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లోనూ భారత్, ఆస్ట్రేలియా జట్లే తలపడిన సంగతి తెలిసిందే. దీంతో నాడు భారత సీనియర్ జట్టుకు ఎదురైన ఓటమికి నేడు యువ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.


తుది జట్లు

ఆస్ట్రేలియా అండర్19: హ్యారీ డిక్సన్, సామ్ కాన్స్టాస్, హ్యూ వీబ్జెన్(కెప్టెన్), హర్జాస్ సింగ్, ర్యాన్ హిక్స్(వికెట్ కీపర్), ఆలివర్ పీక్, రాఫ్ మాక్‌మిల్లన్, చార్లీ ఆండర్సన్, టామ్ స్ట్రాకర్, మహ్లీ బార్డ్‌మన్, కల్లమ్ విడ్లర్

ఇండియా అండర్19: ఆదర్శ్ సింగ్, అర్షిన్ కులకర్ణి, ముషీర్ ఖాన్, ఉదయ్ సహారన్(కెప్టెన్), ప్రియాంషు మోలియా, సచిన్ దాస్, ఆరవెల్లి అవనీష్(వికెట్ కీపర్), మురుగన్ అభిషేక్, రాజ్ లింబానీ, నమన్ తివారీ, సౌమీ పాండే

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 01:17 PM