Share News

Team India: టీమిండియాలో లేఆఫ్స్ మొదలు.. ఆ నలుగురికి గుడ్‌బై

ABN , Publish Date - Nov 03 , 2024 | 09:48 PM

Team India: ఒక్క సిరీస్‌తో టీమిండియాలో పెను మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఏకంగా సీనియర్ల మీదే వేటు పడటం పక్కా అని తెలుస్తోంది. ఒకరు, ఇద్దరు కాదు.. నలుగురు సీనియర్లను పక్కన పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నారట.

Team India: టీమిండియాలో లేఆఫ్స్ మొదలు.. ఆ నలుగురికి గుడ్‌బై

IND vs NZ: ఒక్క సిరీస్.. ఒకే ఒక్క సిరీస్ భారత క్రికెట్‌లో పెను మార్పులకు కారణమవుతోంది. సొంతగడ్డ మీద రోహిత్ సేన చిత్తుగా ఓడటాన్ని అటు అభిమానులు, ప్రేక్షకులతో పాటు ఇటు భారత క్రికెట్ బోర్డు కూడా జీర్ణించుకోలేకపోతోంది. 0-3 తేడాతో ఓడటంతో టీమిండియాపై తీవ్ర స్థాయిలో నలువైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో బోర్డు కఠిన చర్యలకు అడుగులు వేస్తోందని తెలిసింది. డేంజర్స్ బెల్స్ మోగుతున్నాయని.. టీమ్‌లో లేఆఫ్స్‌కు సమయం ఆసన్నమైందని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఏకంగా నలుగురు సీనియర్లను పక్కన పెట్టేందుకు కసరత్తు మొదలైందని సమాచారం. మరి.. ఎవరా సీనియర్ క్రికెటర్లు? అనేది ఇప్పుడు చూద్దాం..


వేటు ఖాయం

సాధారణంగా జట్టు ఓడిపోయినప్పుడు ఎక్కువగా జూనియర్లను బాధ్యుల్ని చేస్తుంటారు. ఒకవేళ సీనియర్ల వైఫల్యం ఎక్కువగా ఉంటే ఒకట్రెండు సిరీస్‌ల నుంచి తప్పిస్తారు. కానీ భారత బోర్డు మాత్రం కివీస్ చేతుల్లో వైట్‌వాష్‌ను సీరియస్‌గా తీసుకుంటోందట. జట్టులో నుంచి ఏకంగా నలుగురు సీనియర్లను శాశ్వతంగా బయటకు పంపాలని భావిస్తోందట. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ, టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా పేర్లు ఉన్నట్లు సమాచారం. వీళ్లలో కనీసం ఇద్దరి మీద వేటు ఖాయమని.. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీనే వాళ్ల కెరీర్‌లో ఆఖరిదని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.


చివరి టెస్ట్ ఆడేశారా?

రోహిత్, కోహ్లీ, అశ్విన్, జడేజాకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి అవకాశమని తెలుస్తోంది. ఇందులో బాగా ఆడిన వారి కెరీర్‌ను పొడిగిస్తారని.. ఫెయిలైన వారికి రిటైర్మెంట్ తప్ప ఇంకో గత్యంతరం లేదని ఎక్స్‌పర్ట్స్ కూడా అంటున్నారు. ఈ నలుగురిలో కనీసం ఇద్దరు టీమ్‌లో నుంచి బయటకు వెళ్లిపోవడం పక్కా అని అంటున్నారు. ఒకవేళ రోహిత్-కోహ్లీ రాబోయే మరికొన్ని సిరీస్‌లు ఇలాగే విఫలమైతే వాళ్లకు కూడా మరో ఆప్షన్ ఉండదని హెచ్చరిస్తున్నారు. తాజాగా ముగిసిన కివీస్ సిరీస్ వీళ్లకు లాస్ట్ హోమ్ సిరీస్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.


Also Read

కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమయ్యా.. ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదే: రోహిత్ శర్మ.

టీమిండియాపై సచిన్ సీరియస్.. ఊరుకునేది లేదంటూ..

సర్ఫరాజ్ కెరీర్ క్లోజ్.. ఇంక డొమెస్టికే దిక్కు

For Sports And Telugu News

Updated Date - Nov 03 , 2024 | 09:56 PM