Share News

Virat Kohli: టీమిండియాను భయపెడుతున్న కోహ్లీ.. ఆసీస్‌ను ఏడిపిస్తాడనుకుంటే..

ABN , Publish Date - Dec 03 , 2024 | 07:28 PM

Virat Kohli: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమిండియాను భయపెడుతున్నాడు. జట్టుకు మూలస్తంభం లాంటి విరాట్.. పెర్త్ టెస్ట్‌ మాదిరిగా అడిలైడ్‌లోనూ ఆస్ట్రేలియాను ఏడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ కింగ్ మాత్రం దీనికి రివర్స్ చేస్తున్నాడు.

Virat Kohli: టీమిండియాను భయపెడుతున్న కోహ్లీ.. ఆసీస్‌ను ఏడిపిస్తాడనుకుంటే..

IND vs AUS: టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమిండియాను భయపెడుతున్నాడు. జట్టుకు మూలస్తంభం లాంటి విరాట్.. పెర్త్ టెస్ట్‌ మాదిరిగా అడిలైడ్‌లోనూ ఆస్ట్రేలియాను ఏడిపిస్తాడని అంతా అనుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు కింగ్. కంగారూలను బ్యాక్ సీట్‌లో నెట్టేసిన స్టార్ బ్యాటర్.. మనతో మ్యాచ్ అంటే వణికిపోయేలా చేశాడు. దీంతో సిరీస్‌లో ఎలా కమ్‌బ్యాక్ ఇవ్వాలా అని ఆసీస్ ఆలోచిస్తోంది. ఇదే జోరును కొనసాగిస్తూ అడిలైడ్ టెస్ట్‌లోనూ విక్టరీ కొట్టాలని టీమిండియా భావిస్తోంది. కానీ కింగ్ మాత్రం దీనికి రివర్స్ చేస్తున్నాడు. అసలు మేనేజ్‌మెంట్‌కు కోహ్లీ భయం ఎందుకు పట్టుకుంది? అనేది ఇప్పుడు చూద్దాం..


మోకాలికి బ్యాండేజీతో..

డిసెంబర్ 6 నుంచి మొదలవనున్న అడిలైడ్ టెస్ట్‌కు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇప్పటికే అక్కడికి చేరుకున్న భారత్-ఆస్ట్రేలియా ఆటగాళ్లు పింక్ బాల్ టెస్ట్ కోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే కోహ్లీ మోకాలికి బ్యాండేజీ వేసుకొని ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాసేపు వార్మప్, ఆ తర్వాత బ్యాటింగ్ సాధన చేసిన కింగ్.. మిగతా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


ట్రీట్‌మెంట్ చేసినా..

కోహ్లీ మోకాలికి బ్యాండేజీ ఉన్న ఫొటోలు వైరల్ అవడం, అతడు మధ్యలోనే బయటకు వెళ్లిపోవడంతో అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ప్రాక్టీస్ సెషన్‌లో మోకాలి నొప్పితో బాధపడటంతో మెడికల్ టీమ్ వచ్చి అతడికి ట్రీట్‌మెంట్ చేశారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడికి బ్యాండేజీ వేశారని సమాచారం. ఈ నొప్పి తీవ్రత తక్కువగా ఉంటే సమస్య లేదు. కానీ తగ్గకపోతే మాత్రం టీమిండియాకు పెద్దదెబ్బే. అడిలైడ్‌లో ఆడిన 8 మ్యాచుల్లో 63 సగటుతో 509 పరుగులు చేశాడు కింగ్. అలాంటోడు ఆడకపోతే రిజల్ట్ మీద తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది. అందుకే ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కంగారూలను ఏడిపిస్తాడనుకుంటే.. మనల్ని భయపెడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అతడు గాయం నుంచి కోలుకొని ఆసీస్ పనిపట్టాలని కోరుకుంటున్నారు.


Also Read:

ఇరకాటంలో బీసీసీఐ.. అంతా పాకిస్థాన్ వల్లే..

పాండ్యా బ్రదర్స్‌ను భయపెట్టిన సీఎస్‌కే బౌలర్.. ఐపీఎల్‌ రైవల్రీ షురూ

జైస్వాల్‌పై రోహిత్ సీరియస్.. ఎందుకిలా చేశావ్ అంటూ..

For More Sports And Telugu News

Updated Date - Dec 03 , 2024 | 07:28 PM