Share News

Jayden Seales: వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు.. 46 ఏళ్లలో ఇదే తొలిసారి

ABN , Publish Date - Dec 02 , 2024 | 02:48 PM

Jayden Seales: వెస్టిండీస్ సీమర్ జేడెన్ సీల్స్ సంచలన రికార్డు నమోదు చేశాడు. టీమిండియా స్టార్ పేరిట ఉన్న అరుదైన రికార్డును అతడు బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఈ మైల్‌స్టోన్ నమోదవడం 46 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

Jayden Seales: వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు.. 46 ఏళ్లలో ఇదే తొలిసారి

BAN vs WI: క్రికెట్‌లో రికార్డులు నమోదవడం సర్వసాధారణమే. అయితే ఆల్‌టైమ్ రికార్డులు, అరుదైన రికార్డులు మాత్రం అప్పుడప్పుడు బ్రేక్ అవుతుంటాయి. కొన్ని రికార్డులైతే ఏళ్లకు ఏళ్లుగా అలా ఉండిపోతాయి. వాటిని బద్దలు కొట్టడం చాలా కష్టం. కానీ అనుకుంటే ఏదైనా సాధ్యమే అన్నట్లు పలువురు ఆటగాళ్లు తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో వాటి బూజు దులుపుతుంటారు. పాత రికార్డులకు పాతర పెడుతుంటారు. తాజాగా ఓ వెస్టిండీస్ సీమర్ ఇలాగే సంచలన రికార్డు నమోదు చేశాడు. టీమిండియా స్టార్ పేరిట ఉన్న అరుదైన రికార్డును కరీబియన్ పేసర్ జేడెన్ సీల్స్ బద్దలు కొట్టాడు. టెస్ట్ క్రికెట్‌లో ఇలా జరగడం 46 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరి.. సీల్స్ సాధించిన ఆ రికార్డు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


మెయిడిన్లతో మెంటలెక్కించాడు

టెస్ట్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ ఎకానమిక్ స్పెల్ వేసిన బౌలర్స్‌లో ఒకడిగా జేడెన్ సీల్స్ నిలిచాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లు వేసిన సీల్స్.. కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడు వేసిన ఓవర్లలో 10 మెయిడిన్లు ఉండటం విశేషం. తన స్పెల్‌లో ఓవర్‌కు సగటున 0.32 చొప్పున పరుగులు ఇచ్చాడు సీల్స్. గత 46 ఏళ్లలో ఇంత తక్కువ ఎకానమీతో ఓ స్పెల్ వేయడం ఇదే తొలిసారి. కనీసం 10 ఓవర్లను ప్రాతిపదికగా తీసుకొని వేసిన స్పెల్స్‌లో సీల్స్ టాప్‌లో నిలిచాడు.


ఉమేశ్‌ను దాటేశాడు

1978 నుంచి ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా టెస్టుల్లో 0.4 కంటే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేయలేదు. కానీ తాజాగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సీల్స్ 0.32 ఎకానమీని నమోదు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ లిస్ట్‌లో ఉన్న టీమిండియా వెటరన్ పేసర్ ఉమేశ్ యాదవ్ (0.42 ఎకానమీ)ని అతడు దాటేశాడు. 2015లో డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఉమేశ్ ఈ రికార్డును నెలకొల్పాడు. దాన్ని సీల్స్ అధిగమించాడు. ఇక, బెస్ట్ ఎకానమీ స్పెల్స్‌లో చూసుకుంటే.. భారత మాజీ ఆటగాడు బనూ నడ్కర్నీ అగ్రస్థానంలో ఉన్నాడు. 1964లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో అతడు 32 ఓవర్లలో 27 మెయిడిన్లు వేయడమే గాక కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.


Also Read:

పాకిస్థాన్ గాలి తీసిన అక్తర్.. మీరు మారరు అంటూ..

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న ముంబై

ఆ సర్టిఫికెట్ ఉంటేనే షమీకి ఎంట్రీ.. బీసీసీఐ కొత్త మెలిక

For More Sports And Telugu News

Updated Date - Dec 02 , 2024 | 02:49 PM