Share News

Gautam Gambhir: బీసీసీఐకి గౌతమ్ గంభీర్ 5 కండీషన్స్.. ఏంటంటే..?

ABN , Publish Date - Jun 24 , 2024 | 11:40 AM

టీమిండియా హెడ్ కోచ్‌పై సస్పెన్స్ వీడటం లేదు. కోచ్ పదవి కోసం గంభీర్ రేసులో ఉన్నారు. బీసీసీకి చెందిన క్రికెట్ అడ్వైజరి కమిటీ గంభీర్‌ను లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఆ సమయంలో బోర్డు ముందు గంభీర్ 5 డిమాండ్లు విధించారని తెలిసింది.

Gautam Gambhir: బీసీసీఐకి గౌతమ్ గంభీర్ 5 కండీషన్స్.. ఏంటంటే..?
Gautam Gambhir

టీమిండియా హెడ్ కోచ్‌పై సస్పెన్స్ వీడటం లేదు. కోచ్ పదవి కోసం గంభీర్ రేసులో ఉన్నారు. బీసీసీకి చెందిన క్రికెట్ అడ్వైజరి కమిటీ గంభీర్‌ను లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ కూడా చేసింది. ఆ సమయంలో బోర్డు ముందు గంభీర్ 5 డిమాండ్లు విధించారని తెలిసింది. ఇంతకీ అవి ఏంటంటే..?


1. కోచ్ పదవి చేపడితే.. జట్టుకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధిపత్యం తనకే అప్పగించాలి. ఏ విషయంలో బోర్డు కలుగజేసుకోకూడదు.

2. తనకు సహకరించే సిబ్బందిని ఎంపిక చేసుకునే స్వేచ్చను ఇవ్వాలి. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్ తన అభీష్టం మేరకు ఎంపిక జరగాలి.

3. వచ్చే ఏడాది పాకిస్థాన్‌లో ఛాంపియన్స్ ట్రోఫి జరగనుంది. సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ తప్పకుండా రాణించాలి. ఆ సిరీస్‌లో నలుగురు విఫలమైతే వారిని తుది జట్టులో తీసుకునే అవకాశం లేదు. ఏ ఒక్కరి పేరును ప్రస్తావించలేదు. జట్టు విజయం కోసం ఎంతటివారినైనా పక్కన పెడతానని గంభీర్ హింట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

4. టెస్ట్ జట్టుకు సపరేట్ టీమ్ ఎంపిక చేస్తానని గంభీర్ అంటున్నారు.

5. కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిప్పటి నుంచి 2027 వన్డే వరల్డ్ కప్ గెలిచేందుకు కృషి చేస్తానని గంభీర్ చెబుతున్నారు.


ఆడకుంటే.. అంతే సంగతులు..!!

ఛాంపియన్స్ ట్రోఫిలో సీనియర్ ప్లేయర్స్ రాణించకపోతే తర్వాత తుది జట్టులో అవకాశం ఉండదు. అయితే రెడ్ బాల్ క్రికెట్‌లో ఆడిస్తారా అనే ప్రశ్నకు సమాధానం లేదు. కోహ్లి, రోహిత్ కెరీర్‌పై ఇప్పటికే స్పష్టత లేదు. ఒకవేళ గంభీర్ కోచ్ పదవి చేపడితే ఆ ఇద్దరికీ బూస్టింగ్ ఖాయం అనే క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది వరల్డ్ టెస్ట్ చాంఫియన్ షిప్ జరగనుంది. ఆ సిరీస్ కూడా సీనియర్లకు ముఖ్యం కానుంది. 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా ఛాంపియన్ షిప్ గెలిచాయి. ఈ సారి ఇండియా గెలవకుంటే సీనియర్ల భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉంది.

Updated Date - Jun 24 , 2024 | 11:42 AM