Share News

IPL 2024: నేడు LSG vs CSK కీలక మ్యాచ్.. సొంత మైదానంలో కట్టడి చేస్తారా?

ABN , Publish Date - Apr 19 , 2024 | 11:28 AM

నేడు ఐపీఎల్ 2024లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్లలో ఏ టీం ఎక్కువగా గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.

IPL 2024: నేడు LSG vs CSK కీలక మ్యాచ్.. సొంత మైదానంలో కట్టడి చేస్తారా?
ipl 2024 LSG vs CSK 34th match win prediction

నేడు ఐపీఎల్ 2024(IPL 2024)లో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు 34వ మ్యాచ్ మొదలు కానుంది. ఈ కీలక మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియం(Ekana Cricket Stadium)లో జరగనుంది. అయితే లక్నో(Lucknow) సొంత మైదానంలో ఈ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఎలాగైనా చైన్నై జట్టును కట్టడి చేయాలని లక్నో ఆటగాళ్లు భావిస్తున్నారు. మరోవైపు చెన్నై కూడా గెలిచి పాయింట్ల పట్టికల్లో తన స్థానాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది.


పాయింట్ల పట్టికలో లక్నో(LSG) జట్టు 5వ స్థానంలో ఉండగా, చెన్నై(CSK) జట్టు 3వ స్థానంలో ఉన్నాయి. ఇప్పటి వరకు లక్నో, చెన్నై జట్లు 6 మ్యాచ్‌లు ఆడాయి. అందులో లక్నో 3 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. చెన్నై 4 మ్యాచ్‌ల్లో గెలుపొందగా ఈ జట్టు 2 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇరు జట్ల ప్రదర్శన బాగానే ఉంది. దీంతో నేటి మ్యాచ్ కూడా ఉత్కంఠగా కొనసాగనుంది.


ఇక లక్నోలో పిచ్(pitch) గురించి తెలుసుకుంటే ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఎక్కువగా విజయాలు సాధించాయి. ఆ క్రమంలో ఆరు మ్యాచ్‌లు గెలవగా, ఛేజింగ్ చేసిన జట్లు మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించాయి. కాబట్టి టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గూగుల్ గెలుపు అంచనా ప్రకారం నేటి మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచేందుకు 56 శాతం అవకాశం ఉండగా, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు గెలిచేందుకు 44 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది.


చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ప్రాబబుల్ టీంలో రుతురాజ్ గైక్వాడ్ (C), దీపక్ చాహర్, ఎంఎస్ ధోనీ (WK), అజింక్య రహానే, రచిన్ రవీంద్ర, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్‌పాండే, డారిల్ మిచెల్, మహేశ్ తిక్షణా, ముస్తాఫిజుర్ రహమాన్ కలరు.

లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) ప్రాబబుల్ జట్టులో క్వింటన్ డి కాక్, KL రాహుల్(w/c), దీపక్ హుడా, ఆయుష్ బదోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, షమర్ జోసెఫ్, యశ్ ఠాకూర్ ఉన్నారు.


ఇది కూడా చదవండి:

హమ్మయ్య..ముంబై


వినే్‌షపైనే అందరి దృష్టీ


మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 19 , 2024 | 11:33 AM