Share News

Cricket: నేడు ఢిల్లీకి టీమిండియా క్రికెట్ టీమ్.. విమానశ్రయానికి భారీగా ఫ్యాన్స్..

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:28 AM

టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా టీమిండియా క్రికెట్ టీమ్ కరేబీయన్ దీవుల్లోనే ఉండిపోయింది. బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ముద్దాడింది.

Cricket: నేడు ఢిల్లీకి టీమిండియా క్రికెట్ టీమ్.. విమానశ్రయానికి భారీగా ఫ్యాన్స్..
India Cricket Team

టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత వాతావరణ పరిస్థితుల కారణంగా టీమిండియా క్రికెట్ టీమ్ కరేబీయన్ దీవుల్లోనే ఉండిపోయింది. బార్బొడాస్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి.. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ముద్దాడింది. వాస్తవానికి ఆదివారం లేదా సోమవారం కరేబీయన్ దీవుల నుంచి టీమిండియా స్వదేశానికి రావాల్సి ఉంది. అయితే తుపాను కారణంగా బార్బొడాస్‌లోనే నాలుగు రోజులుగా ఉండిపోవాల్సి వచ్చింది. మరోవైపు జులై 6వ తేదీ నుంచి జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల టీ20 సీరిస్ కోసం భారత జట్టు వెళ్లాల్సి ఉంది. దీంతో బీసీసీఐ భారత క్రికెట్ జట్టు కోసం బార్బొడాస్‌కు ప్రత్యేక విమానాన్ని పంపించింది. బుధవారం రాత్రికి భారత క్రికెట్ జట్టు ఢిల్లీ విమానశ్రయానికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత క్రికెట్ జట్టుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఫ్యాన్స్ భారీగా విమానశ్రయానికి వచ్చే అవకాశం ఉండటంతో భద్రత కట్టుదిట్టం చేశారు.

రోహిత్‌ ఫోన్‌ చేసుండకపోతే..


పొట్టి ప్రపంచకప్ గెలిచిన తర్వాత..

టీ20 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత భారత క్రికెట్ జట్టు తొలిసారి స్వదేశానికి వస్తున్న నేపథ్యంలో జట్టుకు ఘన స్వాగతం పలికేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. టీ20 ప్రపంచకప్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. విరాట్ కోహ్లీ సైతం రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో టీమిండియా టీ20 కెప్టెన్‌ను బీసీసీఐ నియమించాల్సి ఉంది. హర్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, బుమ్రాల్లో ఎవరో ఒకరిని టీ20 కెప్టెన్‌గా ఎంపిక చేస్తారనే ప్రచారం జరుగుతోంది. టీ20ల్లో అనుభవం దృష్ట్యా పాండ్యా లేదా బ్రూమాల్లో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేయవచ్చు.

టీఓఏలో ఎన్నికల రగడ


జింబాబ్వేటూర్‌కు..

జులై 6నుంచి 14 వరకు జింబాబ్వేతో భారత్ 5 మ్యాచ్‌ల టీ20 సీరిస్ ఆడనుంది. దీనికోసం ఇప్పటికే బీసీసీఐ జట్టును ప్రకటించింది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. దీంతో రేపు భారత జట్టు జింబాబ్వే టూర్‌కు బయలుదేరనుంది. ఇప్పటికే బార్బొడాస్‌ నుంచి స్వదేశానికి రావాల్సి ఉన్నా.. వాతావరణం కారణంగా భారత క్రికెట్ జట్టు ఢిల్లీ చేరుకోలేకపోయింది.


జింబాబ్వే టూర్‌కు జితేష్‌, సుదర్శన్‌, హర్షిత్‌

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Sports News and Latest Telugu News

Updated Date - Jul 03 , 2024 | 09:28 AM