IPL 2024: నేడు మధ్యాహ్నం DC vs MI మ్యాచ్.. ఎవరు గెలుస్తారు, పిచ్ రిపోర్ట్ ఏంటి?
ABN , Publish Date - Apr 27 , 2024 | 10:54 AM
ఐపీఎల్ 2024లో నేడు 43వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్టుతో తలపడుతుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే DC, MI మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉంటుంది, ఏ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 43వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టుతో తలపడుతుంది. రెండు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా, ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే DC, MI మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో పిచ్ ఎలా ఉంటుంది, ఏ మ్యాచ్ గెలిచే అవకాశం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఢిల్లీ(delhi)లోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో ఈరోజు బ్యాట్స్‌మెన్లకు గట్టి పోటీ ఉంటుంది. ఎందుకంటే ఈ మైదానం చిన్నదిగా ఉండడంతో ఇక్కడ చాలా ఫోర్లు, సిక్సర్లు వెళ్లే అవకాశం ఉంది. ఈ స్టేడియం పిచ్ కారణంగా ఇక్కడ స్పిన్నర్లు కూడా చాలా సపోర్ట్ పొందుతారు. దీంతో నేటి మ్యాచ్‌లో అత్యధిక స్కోరింగ్‌ను ఆశించవచ్చు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ చేయడానికే మొగ్గుచూపుతారని చెప్పవచ్చు. ఇక పాయింట్ల పట్టికలో ఢిల్లీ జట్టు 6వ స్థానంలో, ముంబై జట్టు 9వ స్థానంలో ఉన్నాయి. ఢిల్లీ ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడగా, అందులో 4 మ్యాచ్‌ల్లో గెలిచి 5 ఓటమిని చవిచూసింది. ముంబై జట్టు 8 మ్యాచ్‌లు ఆడింది. 3 మ్యాచ్‌లు గెలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో నేటి మ్యాచ్ ఉత్కంఠగా కొనసాగనుంది.
ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ(DC), ముంబై(MI) జట్లు 34 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 15 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. కాగా ముంబై ఇండియన్స్ 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ముంబైపై ఢిల్లీ అత్యధిక స్కోరు 213 పరుగులు. ఢిల్లీపై ముంబై అత్యధిక స్కోరు 234 పరుగులు. ఈ క్రమంలో ఈరోజు మ్యాచులో గూగుల్(google) గెలుపు అంచనా(Win Prediction) ప్రకారం చూస్తే ముంబై ఇండియన్స్ జట్టు 60 శాతం గెలిచేందుకు అవకాశం ఉండగా, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 40 శాతం ఉంది.
ముంబై ఇండియన్స్(Mumbai Indians) ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా (C), శివాలిక్ శర్మ, డెవాల్డ్ బ్రీవిస్, ఇషాన్ కిషన్, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, టిమ్ డేవిడ్, ఆకాష్ మధ్వల్, విష్ణు వినోద్, తిలక్ వర్మ, అన్షుల్ కాంబోజ్ , మహ్మద్ నబీ, క్వేనా మఫాకా, షామ్స్ ములానీ, నువాన్ తుషార, రొమారియో షెపర్డ్, సూర్యకుమార్ యాదవ్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, నమన్ ధీర్, ల్యూక్ వుడ్.
ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) ప్రాబబుల్ ప్లేయింగ్ 11: రిషబ్ పంత్ (C), డేవిడ్ వార్నర్, కుల్దీప్ యాదవ్, పృథ్వీ షా, ఇషాంత్ శర్మ, విక్కీ ఓస్త్వాల్, ప్రవీణ్ దూబే, ఝే రిచర్డ్‌సన్, అక్షర్ పటేల్, స్వస్తిక్ చికారా, లలిత్ యాదవ్, యశ్ ధుల్, అన్రిచ్ నోర్ట్జే, అభిషేక్ ఫోరెల్, అభిషేక్ పోరేల్ మెక్‌గుర్క్, ఖలీల్ అహ్మద్, సుమిత్ కుమార్, ముఖేష్ కుమార్, రసిక్ దార్, కుమార్ కుషాగ్రా, రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, షాయ్ హోప్.
ఇది కూడా చదవండి:
Read Latest Sports News and Telugu News