TG News: అప్జల్‌గంజ్ పీఎస్‌లో ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Apr 18 , 2024 | 10:07 PM
నగరంలోని అప్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) పై గురువారం నాడు కేసు నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని పోలీసులు రాజాసింగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద ర్యాలీని నిలిపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఆరోపించారు.
హైదరాబాద్: నగరంలోని అప్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) పై గురువారం నాడు కేసు నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహించారు. అయితే అనుమతి లేకుండా భారీగా భక్తులతో శోభాయాత్ర నిర్వహించారని పోలీసులు రాజాసింగ్‌పై సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రధాన ర్యాలీ వస్తున్న సమయంలో గౌలిగూడ వద్ద ర్యాలీని నిలిపి బాణాసంచా కాల్చారని పోలీసులు ఆరోపించారు.
Jagadish Reddy: కేసీఆర్ జోలికి వస్తే తన్ని తరిమేస్తామన్న మాజీ మంత్రి
ర్యాలీని నిలిపివేసి రాజాసింగ్ ప్రసంగిస్తూ భక్తులకు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారని పోలీసులు పేర్కొన్నారు. రాజాసింగ్‌పై 341, 188, 290,171-c రెడ్ విత్ 34 ఐపీసీ సహా పలు సెక్షన్లతో రాజాసింగ్‌పై కేసును పోలీసులు నమోదు చేశారు. రాజాసింగ్‌తో పాటు జోగేందర్ సింగ్, బిట్టులపై అప్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
CM Revanth Reddy: రేపటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..