Share News

Domestic Violence: 66.7% మహిళలపై భౌతిక హింస

ABN , Publish Date - Sep 29 , 2024 | 04:57 AM

రాష్ట్రంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఇప్పటికీ భర్తల చేతుల్లో భార్యలు హింసకు గురువుతూనే ఉన్నారు.

Domestic Violence: 66.7% మహిళలపై భౌతిక హింస

  • నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో స్వచ్ఛంద సంస్థల సర్వే

హైదరాబాద్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలపై హింస, దాడులు ఆగడం లేదు. ఇప్పటికీ భర్తల చేతుల్లో భార్యలు హింసకు గురువుతూనే ఉన్నారు. నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో 81.6% మంది మహిళలకు భర్తల తిట్లు తప్పడం లేదు. మహిళా కిసాన్‌ అధికార్‌ మంచ్‌(మకామ్‌), సొసైటీ ఫర్‌ ప్రమోటింగ్‌ పార్టిసిపేటివ్‌ ఎకోసిస్టం మేనేజ్‌మెంట్‌(ఎ్‌సఓపీపీఈసీఓఎం) అనే స్వచ్ఛంద సంస్థలు ఈ రెండు జిల్లాల్లో మహిళల పరిస్థితిపై సర్వే చేశాయి. ఈ సర్వే వివరాల ప్రకారం 66.7ు మంది మహిళలు భర్తల చేతుల్లో భౌతిక హింసకు గురవుతున్నట్లు తేలింది.


కుటుంబ సభ్యుల ద్వారా భౌతిక దాడులకు గురవుతున్న మహిళలు 7.1 శాతం వరకు ఉన్నారు. సంపాదించే డబ్బును ఇవ్వాలంటూ 9.9 శాతం మంది మహిళలను వేధిస్తున్నారు. కుటుంబానికి వచ్చే ఆదాయం మొత్తంలో 7.8 శాతం మంది మహిళలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదు. మద్యం కూడా కుటుంబాల్లో చిచ్చు పెడుతోంది. దీని ప్రభావంతో 34.8 శాతం మంది మహిళలు హింసకు గురవుతున్నారు. వరకట్న హింసకు గురవుతున్నవారి శాతం 7.8. భార్యకు విడాకులు ఇవ్వకుండానే పెళ్లిళ్లు చేసుకుంటున్న భర్తలు 3.8 శాతం మంది ఉన్నారు. కుటుంబ ఆస్తిలో 8.5 శాతం మంది మహిళలకు ఎలాంటి పంపకాలు చేయకుండా నిరాకరిస్తున్నారు. ఆస్తిలో వాటా కావాలని అడిగిన మహిళల్లో 7.1 శాతం మంది హింసకు గురవుతున్నారు.

Updated Date - Sep 29 , 2024 | 04:57 AM