Share News

Aspiring Doctor: చదువుల తల్లికి ఆర్థిక కష్టం..

ABN , Publish Date - Oct 07 , 2024 | 03:55 AM

అమ్మనాన్న లేకున్నా ఆసక్తితో చదివింది. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూనే వైద్యురాలు కావాలనే కసితో కష్టపడి చదివి ఎంబీబీఎ్‌సలో సీటు సంపాదించింది.

Aspiring Doctor: చదువుల తల్లికి ఆర్థిక కష్టం..

  • ఎంబీబీఎ్‌సలో సీటు వచ్చినా... వెళ్లలేని పరిస్థితి

  • వెలుగులోకి తెచ్చిన ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి

  • స్పందించిన మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్‌

ఖమ్మం, అక్టోబరు 6: అమ్మనాన్న లేకున్నా ఆసక్తితో చదివింది. అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటూనే వైద్యురాలు కావాలనే కసితో కష్టపడి చదివి ఎంబీబీఎ్‌సలో సీటు సంపాదించింది. సీటు సంపాదించినప్పటికీ కాలేజీలో చేరేందుకు కూడా అవసరమైన డబ్బులు లేక ఇబ్బందిపడుతోంది. ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం దుద్దిపుడి గ్రామానికి చెందిన శ్రీహర్షిత అంబేడ్కర్‌ కాలేజీలో ఇంటర్‌ పూర్తిచేసి, మరో సంవత్సరం లాంగ్‌టర్మ్‌ తీసుకొని నీట్‌లో ర్యాంకు సంపాదించి వనపర్తి గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలో సీటు కూడా దక్కించుకొంది.


అయితే తనను పెంచిన అమ్మమ్మ తాతయ్యలు పేదవారు కావడంతో ఆర్థిక సాయం చేయమని దాతలను కోరింది. ఈ విషయాన్ని ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి చానెల్‌ వెలుగులోకి తెచ్చింది. దీనిపై స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు తనయుడు యుగంధర్‌ ఆమెకు అండగా ఉంటానని ఎక్స్‌ వేదికగా హామీ ఇచ్చారు.

Updated Date - Oct 07 , 2024 | 03:55 AM