Bandi Sanjay: దీపావళి దాటింది.. రాజకీయ బాంబులు పేల్చలేదేం
ABN , Publish Date - Nov 02 , 2024 | 05:12 AM
‘‘దీపావళి తర్వాత రాజకీయ బాంబులు పేలుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పండుగ దాటినా ఎలాంటి బాంబులు పేలలేదు. కాంగ్రె్‌సవి ఉత్తరకుమార ప్రగల్భాలే’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలే
నాయకుడు లేని నావలా బీఆర్‌ఎస్: బండి
కాంగ్రెస్‌వి నేతలవి ఉత్తర కుమార ప్రగల్భాలే
నాయకుడు లేని నావలా బీఆర్‌ఎస్: బండి
బెజ్జంకి/సిరిసిల్ల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘‘దీపావళి తర్వాత రాజకీయ బాంబులు పేలుతాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. పండుగ దాటినా ఎలాంటి బాంబులు పేలలేదు. కాంగ్రె్‌సవి ఉత్తరకుమార ప్రగల్భాలే’’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే దేవాలయాలపై దాడులు జరగడం ఆనవాయితీగా మారిందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు లేని నావలా తయారైందని, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఆరు నెలలుగా ఫాంహజ్‌కే పరిమితమయ్యారని, కుటుంబానికి ఆపదొస్తే తప్ప ఆయన నోరు విప్పరని విమర్శించారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని, రూ.లక్షన్నర కోట్లు దోచుకునే కుట్రకు తెరదీస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులు ఎన్నో ఆశలతో గ్రూపు-1 పరీక్షలకు సిద్ధమైనా ప్రభుత్వం వారిని పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో 29ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.