Share News

Bandi Sanjay: ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి

ABN , Publish Date - Sep 16 , 2024 | 03:05 AM

కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Bandi Sanjay: ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండి

  • 50 ఏళ్లు రాష్ట్ర ప్రజలను వంచించారు కదా

  • జనాన్ని హింసించిన రజకార్ల పార్టీతో దోస్తీనా

  • కాంగ్రె్‌సపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధ్వజం

హైదరాబాద్‌ సిటీ/హైదరాబాద్‌, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. 50 ఏళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ ప్రజలను వంచించినందున.. ‘తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం‘ నిర్వహించుకోవాలని విమర్శించారు. తెలంగాణ ప్రజలను హింసించిన రజకార్ల పార్టీ వారసులకు కాంగ్రెస్‌ వత్తాసు పలకడం సిగ్గు చేటన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవ నేపథ్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానంలో సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌(సీబీసీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆదివారం బండి సంజయ్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.


నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటాలు, సమర యోధుల త్యాగాలను ఎగ్జిబిషన్‌లో కళ్లకు కట్టినట్లు చూపారని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన కోసం జరిగిన పోరాటాల చరిత్రను రాష్ట్ర పాలకులు 75 ఏళ్లపాటు తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. రాబోయే తరాలకు ఈ చరిత్రను అందించాలన్న ఉద్దేశంతో తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.


ఆపరేషన్‌ పోలోతో తెలంగాణకు విముక్తి కల్పించిన మహనీయుడు సర్దార్‌ పటేల్‌ అని కొనియాడారు. తెలంగాణ విమోచన ఉత్సవాలపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట మాట్లాడాయని అన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ పరేడ్‌ మైదానంలో యువకులతో కలిసి కాసేపు క్రికెట్‌ ఆడారు. తెలంగాణ విమోచన పోరాటాలను పాఠ్యాంశంగా పొందుపర్చాలని ఎంపీ లక్ష్మణ్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మజ్లి్‌సతో ఉన్న బంఽధం కారణంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు.

Updated Date - Sep 16 , 2024 | 03:05 AM