Share News

Kites: గాలిపటం ఎగరేసే సమయంలో బీకేర్‌ఫుల్..! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?

ABN , Publish Date - Jan 15 , 2024 | 01:03 PM

సంక్రాంతి వచ్చిందంటే ఒక్కటే హడావిడి ఉంటుంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చారో లేదో అంతే అలా పతంగులతో ఆడతారు. నగరాలు, పట్టణాల్లో ఎత్తైన బిల్డింగుల నుంచి గాలి పటం ఎగరేయడంతో ప్రమాదాలకు కారణం అవుతాయి.

 Kites: గాలిపటం ఎగరేసే సమయంలో బీకేర్‌ఫుల్..! ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..?

హైదరాబాద్: సంక్రాంతి (Sankranthi) వచ్చిందంటే ఒక్కటే హడావిడి ఉంటుంది. పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేరు. స్కూళ్లకు (Schools) సెలవులు ఇచ్చారో లేదో అంతే అలా పతంగులతో ఆడతారు. దాంతో ప్రమాదాలు జరుగుతుంటాయి. నగరాలు, పట్టణాల్లో ఎత్తైన బిల్డింగుల నుంచి గాలి పటం ఎగరేయడంతో ప్రమాదాలకు కారణం అవుతాయి. సంక్రాంతి (Sankranthi) సమయంలో పిల్లలు గాలిపటం ఎగరేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..?

దేవతలకు ఆహ్వానం

సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి జరుపుకుంటారు. దేవతలు ఆకాశంలో విహరిస్తూ ఉంటారు. వారిని ఆహానించడానికి గాలి పటాలు ఎగరేస్తారని పురాణాల్లో రాసి ఉంది. అందుకే సంక్రాంతి సమయంలో గాలి పటాల విక్రయం జోరుగా సాగుతుంది.

మైదానాల్లో ఎగరేయాలి

సంక్రాంతి సమయంలో పిల్లలే కాదు పెద్దలు కూడా సంతోషంగా గడుపుతారు. గాలి పటాలను పెద్దలు కూడా ఎగరేస్తారు. పక్కనొడి గాలి పటాన్ని పడేయాలని తెగ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బంగాళ మీద తాము ఉండే చోటను మరచిపోతారు. అలా డాబా చివరికి వచ్చి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆ ఘటనల్లో కొందరు చనిపోగా, మరికొందరు గాయపడ్డారు. భవనం పైన కాకుండా మైదాన ప్రాంతంలో గాలి పటం ఎగరేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొందరికి గ్రౌండ్ దూరంలో ఉంటే పిల్లలు పతంగులు ఎగరవేసే సమయంలో విధిగా పెద్దలు ఉండాలి. అలా అయితే అటు, ఇటు డాబాపై నడిచిన ప్రమాదం బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది.

జనం లేని చోట ఎగరేయాలి

జనం లేని చోట గాలి పటాలు ఎగరవేయాలి. రోడ్ల మీద ఎట్టి పరిస్థితుల్లో వేయకూడదు. వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. జనం లేని చోటకు వెళ్లి గాలి పటాలను ఎగరవేయాలి. బిల్డింగ్ పైనుంచి గాలి పటం ఎగరేసే సమయంలో ఇంటి పక్కన ఉన్న విద్యుత్ తీగల మీద పడినప్పటికీ తీసే ప్రయత్నం చేస్తారు పిల్లలు. దీంతో కరెంట్ షాక్‌నకు గురయ్యే అవకాశం ఉంది. గాలి పటం ఎగరవేసే సమయంలో చేతులకు ప్లాస్టర్ చుట్టుకుంటె బెటర్.. ఇలా చేయడం వల్ల దారం తెగిన సమయంలో చేతులకు గాయం కాకుండా ఉంటుంది.

చైనా మాంజా వద్దు

మరో ముఖ్య విషయం.. గాలి పటాల కోసం చైనా మాంజాను వాడతారు. దీని బదులు సాధారణ దారం వాడాలి. చైనా మాంజాల వల్ల మనుషులకే కాదు పక్షులకు కూడా ప్రమాదం వాటిల్లుతుంది. ఒక్కోసారి పక్షుల ప్రాణాలు కోల్పోతాయి. జనం కూడా గాయపడిన ఘటలను మనం చూస్తున్నాం. వాహనాలపై వెళ్తున్న వారి మెడకి తగలడం వల్ల గాయాలు అవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 15 , 2024 | 01:03 PM