Share News

Bandi Sanjay: అది ఆర్థిక బడ్జెటా.. అప్పుల పత్రమా?

ABN , Publish Date - Jul 26 , 2024 | 04:49 AM

డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టింది ఆర్థిక బడ్జెట్టా? లేక అప్పుల పత్రమా? స్పష్టం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Bandi Sanjay: అది ఆర్థిక బడ్జెటా.. అప్పుల పత్రమా?

  • కాంగ్రెస్‌+రాష్ట్ర బడ్జెట్‌ = గాడిద గుడ్డేనా?

  • హామీలపై చేతులెత్తేశారు: బండి సంజయ్‌

హైదరాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టింది ఆర్థిక బడ్జెట్టా? లేక అప్పుల పత్రమా? స్పష్టం చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రె్‌స+రాష్ట్ర బడ్జెట్‌=గాడిద గుడ్డేనా అంటూ ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో.. కాంగ్రెస్‌ హామీలను అమలు చేయడం అంతే నిజమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘12 వేల పోస్టులకే నోటిఫికేషన్‌ ఇచ్చిన మీరు 31 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశామనడం నిరుద్యోగులను మోసగించడమే. రూ.లక్షన్నర కోట్లతో మూసీ రివర్‌ ఫ్రంట్‌ చేపడతామని చెప్పి.. పైసా కేటాయించలేదు.


రంజాన్‌ వేడుకలకు రూ.33కోట్లు కేటాయించి.. హిందువుల పండుగలకు పైసా కేటాయించకపోవడం మతతత్వం కాదా?’అని ప్రశ్నించారు. కాగా, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులు ఇచ్చిన రుణాలకు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఏం సంబంధమో ఆర్థిక మంత్రి సమాధానం చెప్పాలని బీజేఎల్పీ ఉప నేత పాయల శంకర్‌ డిమాండ్‌చేశారు. మహిళా సంఘాలు ఆయా బ్యాంకుల నుంచి రూ.లక్ష కోట్ల రుణం తీసుకుని వడ్డీతో సహా తిరిగి చెల్లించాయని, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ సాయంగా ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

Updated Date - Jul 26 , 2024 | 04:49 AM