Share News

సుంకిశాల అంచనాల పెంపునకు యత్నాలు

ABN , Publish Date - Aug 13 , 2024 | 04:00 AM

సుంకిశాల ప్రాజెక్టు అంచనాలు మళ్లీ పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు.

సుంకిశాల అంచనాల పెంపునకు యత్నాలు

  • ప్రమాదంపై విచారణ చేపట్టలేదేం?: మహేశ్వర్‌రెడ్డి

  • నేడు సుంకిశాలకు బీజేపీ ఎమ్మెల్యేల బృందం

హైదరాబాద్‌, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): సుంకిశాల ప్రాజెక్టు అంచనాలు మళ్లీ పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రూ.800కోట్ల మేర పెంచారని విమర్శించారు. ఈ ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ తప్పిదముందంటున్న మంత్రులు.. తాజా ప్రమాదంపై విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. సదరు కాంట్రాక్టు సంస్థపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు.


తప్పును బీఆర్‌ఎ్‌సపై నెట్టివేసి చేతులు దులుపుకోవడం సరికాదని పేర్కొన్నారు. బీజేఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జరిగిన నష్టాన్ని కాంట్రాక్టు సంస్థతోనే భర్తీ చేయించాలని డిమాండ్‌ చేశారు. కేరళలో నాణ్యత లోపంతో పనులు చేసిన కాంట్రాక్టు సంస్థకు కేంద్రం షోకాజ్‌ నోటీసు ఇచ్చిందని, రాష్ట్రంలోనూ అదే తీరులో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం ఎందుకు షోకాజ్‌ నోటీసు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాగా, బీజేపీ ఎమ్మెల్యేల బృందంసుంకిశాల ప్రాజెక్టును మంగళవారం సుంకిశాల సందర్శించనుంది. ఇటీవల కూలిపోయిన రిటైలింగ్‌వాల్‌ను పరిశీలించనుంది.

Updated Date - Aug 13 , 2024 | 04:00 AM