G. Kishan Reddy: ఆ విషయం.. సీఎం రేవంత్ రెడ్డినే అడగండి..
ABN , Publish Date - Mar 05 , 2024 | 05:03 PM
ప్రధాని నరేంద్ర మోదీని.. సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని ఎందుకన్నారో.. వెళ్లి ఆయన్నే అడగండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీని.. సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అన్నంత మాత్రాన కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయినట్లా? అంటూ ప్రశ్నించారు.
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని.. సీఎం రేవంత్ రెడ్డి పెద్దన్న అని ఎందుకన్నారో.. వెళ్లి ఆయన్నే అడగండి అంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (BJP Telangana President Kishan Reddy) అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీని.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పెద్దన్న అన్నంత మాత్రాన కాంగ్రెస్, బీజేపీ ఒక్కటి అయినట్లా? అంటూ ప్రశ్నించారు. పెద్దన్న అని రేవంత్ రెడ్డి అనడంపై విపక్షాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని... అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమని చెప్పారు.
తెలంగాణలో ప్రధాని మోదీ సభలు సూపర్ సక్సెస్ అయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు. మ్యానిఫెస్టో కోసం రేపటి నుంచి సలహాలు స్వీకరిస్తామన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఎలాంటి క్లారిటీ లేదని తెలిపారు. ఆ గ్యారెంటీలు కేవలం పేపర్‌కే పరిమితమయ్యాయని చెప్పారు. వెంటనే ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే 2లక్షల రుణమాఫీ, 4వేల పెన్షన్‌పై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రజలతో కలసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే కార్యక్రమాన్ని మెదలుపెట్టనున్నట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.