Share News

Uppal: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతం

ABN , Publish Date - Jun 30 , 2024 | 03:41 AM

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతమైంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన మేయర్‌ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ లక్ష్మీరవిగౌడ్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది.

Uppal: బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతం

  • మేయర్‌, డిప్యూటీ మేయర్‌పై నెగ్గిన అవిశ్వాసం

ఉప్పల్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలోని బోడుప్పల్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ హస్తగతమైంది. బీఆర్‌ఎ్‌సకు చెందిన మేయర్‌ సాముల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ లక్ష్మీరవిగౌడ్‌పై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. కీసర ఆర్డీవో వెంకట ఉపేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన కౌన్సిల్‌ సమావేశంలో మేయర్‌, డిప్యూటీ మేయర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై వేర్వేరుగా ఓటింగ్‌ నిర్వహించారు. మొత్తం 28 మంది కార్పొరేటర్లలో సమావేశానికి హాజరైన 22 మంది కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతు పలికారు.


దీంతో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ సొంతమైంది. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో 42 రోజులుగా క్యాంపులో ఉన్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ఎట్టకేలకు శనివారం తిరిగొచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. కాగా, కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతమవడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ నేత, మేడ్చల్‌ ఎమ్మెల్యే తోటకూర వజ్రే్‌షయాదవ్‌ కుమారుడు, బోడుప్పల్‌ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ తోటకూర అజయ్‌యాదవ్‌ మేయర్‌ పీఠం ఎక్కడం దాదాపు ఖాయమైంది.

Updated Date - Jun 30 , 2024 | 03:41 AM