Share News

TS Politics: ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా..

ABN , Publish Date - Mar 12 , 2024 | 08:44 PM

BRS Lok Sabha Candidates: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు (Telangana Lok Sabha Polls) సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది...

TS  Politics: ఊహించని రీతిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా..

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు (Telangana Lok Sabha Polls) సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయిన బీఆర్ఎస్ (BRS).. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్ర ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోవడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. తాజాగా మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది.

నలుగురు అభ్యర్థులు వీరే..

మల్కాజ్‌గిరి : శంభీపూర్ రాజు

చేవేళ్ల : కాసాని జ్ఞానేశ్వర్

మెదక్ : ఒంటేరు ప్రతాప్ రెడ్డి

జహీరాబాద్ : గాలి అనిల్ కుమార్


brs.jpg

ఒక్కరంటే ఒక్కరూ..!

కాగా.. ఈ అభ్యర్థుల్లో అందరూ ఊహించని వారే. వాస్తవానికి మల్కాజిగిరితో పాటు మిగిలిన మూడు స్థానాలకు టికెట్ తమకే కావాలంటూ చాలా మందే బీఆర్ఎస్ మంతనాలు జరిపారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా తన కుమారుడికి టికెట్ ఇప్పించుకోవాలని విశ్వప్రయత్నాలే చేశారు. సీన్ కట్ చేస్తే.. టికెట్ రాకపోగా ఊహించని వ్యక్తికి టికెట్ దక్కింది. ఇక చేవెళ్ల విషయంలోనూ అంతే.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చిన కాసానికి టికెట్ దక్కింది. ఇక్కడ్నుంచి సిట్టింగ్ ఎంపీకే టికెట్ ఇస్తారని నిన్న, మొన్నటి వరకూ ప్రచారం జరిగింది. ఇక మెదక్ నుంచి అయితే.. చాలా పేర్లే తెరపైకి వచ్చినప్పటికీ సీనియర్ నేత వంటేరును టికెట్ వరించింది. ఇక అనిల్ కుమార్ కూడా అంతే. మొత్తానికి చూస్తే.. ఈ నలుగురు అభ్యర్థులూ ఊహించని వారే.

kcr.jpg

ఇదివరకే ఇలా..

కరీంనగర్‌ : బోయినపల్లి వినోద్‌కుమార్‌

పెద్దపల్లి : కొప్పుల ఈశ్వర్‌

ఖమ్మం : నామా నాగేశ్వరరావు

మహబూబూబాద్‌ : మాలోత్‌ కవిత‌

Updated Date - Mar 12 , 2024 | 09:14 PM