Share News

Bura Narasaiah Goud: బీఆర్ఎస్ డిల్లీ లో లేదు...గల్లీలో లేదు..

ABN , Publish Date - Apr 02 , 2024 | 01:09 PM

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూర్, దూల్మిట్ట, వీర భైరన్ పల్లి గ్రామాల్లో భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భార్య భర్తలవి, రాజకీయ నాయకులవి, సినిమా వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి వినడమంత దౌర్భాగ్యం ఎక్కడా లేదన్నారు.

Bura Narasaiah Goud: బీఆర్ఎస్ డిల్లీ లో లేదు...గల్లీలో లేదు..

సిద్దిపేట: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మద్దూర్, దూల్మిట్ట, వీర భైరన్ పల్లి గ్రామాల్లో భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భార్య భర్తలవి, రాజకీయ నాయకులవి, సినిమా వాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేసి వినడమంత దౌర్భాగ్యం ఎక్కడా లేదన్నారు. బీఆర్ఎస్ ఢీల్లీలోనూ లేదని.. గల్లీలోనూ లేదన్నారు. రానున్న రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ కు చర్లపల్లి జైలు పాలవ్వడం ఖాయమని బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.

Hyderabad: గండిపేట కాలువకు గండి.. వృథాగా పోతున్న తాగునీరు

కాంగ్రెస్ గురించి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. అది అభయ హస్తం కాదని.. భస్మాసుర హస్తమన్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు మొదలయ్యాయన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లను అమలు చేయడానికి నిధులు లేవని.. డబ్బులూ లేవన్నారు. మోదీ అంటే దేశం, ధర్మం, అభివృద్ధి అని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అగ్రభాగాన నిలిచిందన్నారు. గతంలో భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడు 9వేల కోట్లతో భువనగిరి, జనగామ,చేర్యాల లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపటట్టం జరిగిందని నర్సయ్య గౌడ్ తెలిపారు. సెప్టెంబర్17 తెలంగాణ విమోచన దినంగా బీజేపీ ప్రకటించిందన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లతో మోదీ ప్రభుత్వం ఏర్పాటు కానుందన్నారు. ప్రధాన మంత్రి మోదీ, కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో వీర భైరాన్ పల్లిని పర్యాటక రంగగా అభివృద్ధి చేస్తామన్నారు.

Kavya: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తోనే పోటీ: కడియం కావ్య

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 02 , 2024 | 01:09 PM