Kavitha: కోర్టులో కవితకు ఎదురుదెబ్బ.. రిలీఫ్ ఇవ్వలేమన్న న్యాయస్థానం..
ABN , Publish Date - Apr 11 , 2024 | 05:52 PM
సీబీఐ అరెస్టు కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కు మరోసారి చుక్కెదురైంది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరాకరిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ దాఖలు చేశారు.
సీబీఐ అరెస్టు కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ముందు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( Kalvakuntla Kavitha ) కు మరోసారి చుక్కెదురైంది. కవితను సీబీఐ అరెస్టు చేయడాన్ని నిరాకరిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్టుపై అత్యవసరంగా సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి మనోజ్ కుమార్ బెంచ్ ముందు అప్లికేషన్ ఫైల్ దాఖలు చేశారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా కవితను సీబీఐ అరెస్ట్ చేసిందని కవిత తరఫు లాయర్లు రాణా, మోహిత్ రావులు వాదనలు వినిపించారు. విచారణ జరిపిన న్యాయస్థానం తన ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించిన వాదనలు జరగలేదని జడ్జి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ కేసులో ఎలాంటి రీలీఫ్ ఇవ్వలేనని చెప్పారు.
Inter Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. రేపే ఇంటర్ రిజల్ట్స్.. పూర్తి వివరాలివే..
సీబీఐ కేసు గురించి ఎలాంటి సమాచారం లేదన్న కోర్టు అత్యవసర జడ్జిమెంట్లపై మాత్రమే వాదనలు జరుగుతున్నాయని తెలిపింది. రేపు ( శుక్రవారం ) ఉదయం 10 గంటలకు రెగ్యులర్ కోర్టు ముందు అప్లికేషన్ ఫైల్ చేయమని సూచించింది. కవిత దాఖలు చేసిన పిటిషన్ ను మెజిస్ట్రేట్ కావేరి భవేజా ధర్మాసనానికి సీబీఐ కోర్టు బదిలీ చేసింది. దీంతో ఈ పిటిషన్ రేపు ఉదయం 10 గంటలకు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
AAP: ఈడీ బెదిరింపులతోనే రాజ్ కుమార్ రాజీనామా.. అతిశీ కామెంట్స్..
కాగా.. ఈడీ కస్టడీలో తీహార్ జైలులో ఉండగానే సీబీఐ కవితను అరెస్టు చేసింది. దీంతో అరెస్టయి కస్టడీలో ఉన్న కవిత మరోసారి అరెస్ట్ అయినట్లయ్యింది. అటు ఈడీ.. ఇటు సీబీఐ కూడా అరెస్ట్ చేయడంతో దిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామమే చోటుచేసుకుందని దిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కస్టడీలో ఉన్న కవితను సీబీఐ ఏప్రిల్ 6న విచారించింది. విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.