Share News

Bandi Sanjay Kumar: మహిళలు, చిన్నారుల భద్రతకు 13,412 కోట్లు

ABN , Publish Date - Aug 01 , 2024 | 04:25 AM

దేశంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.

Bandi Sanjay Kumar: మహిళలు, చిన్నారుల  భద్రతకు 13,412 కోట్లు

  • రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌

న్యూఢిల్లీ, జూలై 31 (ఆంధ్రజ్యోతి): దేశంలోని మహిళలు, చిన్నారుల భద్రత కోసం వివిధ పథకాలు, కార్యక్రమాల కింద రూ.13,412 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో ఒక ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇంటర్‌ ఆపరేబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం కోసం రూ.3375 కోట్లు, ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ కోసం రూ.531.24 కోట్లు, స్కీం ఫర్‌ మోడర్నైజేషన్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌కు రూ.280 కోట్లు, జైళ్ల ఆధునికీకరణకు రూ.950 కోట్లు, రాష్ట్ర సైన్స్‌ ఫోరెన్సిక్‌ లేబొరేటరీల పటిష్టత కోసం రూ.106.75 కోట్లు, సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీలు,


ఫోరెన్సిక్‌ డేటా సెంటర్‌ తోపాటు 6 సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీల ఆధునికీకరణకు రూ.354.25 కోట్లు, సేఫ్‌ సిటీ ప్రాజెక్ట్‌ కోసం రూ.2840 కోట్లు, శిక్షణ, సామర్థ్యం పెంపు కోసం రూ.76.5 కోట్లు, జైళ్లలోని ఖైదీల కోసం రూ.60 కోట్లు, మానవ అక్రమ రవాణా నిరోధక (యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌) యూనిట్‌కు రూ.113.76 కోట్లు, మహిళా హెల్ప్‌ డెస్కుల కు రూ.164.2 కోట్లు, చండీగఢ్‌లో డీఎన్‌ఏ ల్యాబ్‌ ఏర్పాటుకు రూ.42.84 కోట్లు, మహిళలు, చిన్నారులపై సైబర్‌ నేరాల నియంత్రణకు రూ.224.76 కోటు ఖర్చు చేస్తున్నట్టు సంజయ్‌ వివరించారు. కాగా, అన్ని రకాల సైబర్‌ నేరాలను సమన్వయంతో, సమగ్రంగా ఎదుర్కొనేందుకు కేంద్ర హోంశాఖ ‘ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌’(ఐ4సీ)ని ఏర్పాటు చేసినట్లు బండి సంజయ్‌ తెలిపారు. రాజ్యసభలో మరో సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Updated Date - Aug 01 , 2024 | 04:25 AM