Share News

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:23 PM

భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు.

Kishan Reddy: రూ.20తో గంటలో యాదగిరి గుట్టకు.. ఎంఎంటీఎస్ సేవలపై కిషన్ రెడ్డి ప్రకటన

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు అత్యంత చేరువలో ఉన్న అతి పెద్ద దేవాలయం యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం. నగరానికి 60 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ ప్రసిద్ధ ఆలయానికి వెళ్లాలంటే రోడ్డు మార్గం ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే యాదాద్రికి వెళ్లాలనుకుంటున్న భక్తులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం శుభవార్త తెలిపారు. కేవలం రూ.20 తో గుట్టకు చేరుకునేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ నుంచి యాదాద్రికి త్వరలో ఎంఎంటీఎస్ రైల్వే ట్రాక్ నిర్మించనున్నట్లు వెల్లడించారు. యాదాద్రి పుణ్యక్షేత్రానికి నగరం నుంచి రోజు పది వేల మంది భక్తులు వెళ్తారని అంచనా. ప్రస్తుతం రోడ్డు మార్గంలోనే భక్తులు యాదాద్రి పుణ్యక్షేత్రానికి వెళ్తున్నారు. నగరంలో విపరీతమైన ట్రాఫిక్‌ కారణంగా నగరం దాటేందుకు గంటన్నర సమయం పడుతోంది. ఆలయానికి చేరుకోవడానికి మెుత్తంగా నాలుగైదు గంటల సమయం పడుతోంది. దీనికితోడు ప్రైవేటు వాహనాల్లో అధిక మొత్తం ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇకపై ఆ సమస్యలన్నీ తీరిపోనున్నాయి. యాదాద్రి వరకు ప్రత్యేక రైల్వే లైన్ నిర్మించి ఎంఎంటీఎస్‌ను పొడిగిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన టెండర్లు పూర్తి అయ్యాయని అన్నారు.kishan.jpg


త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అమృత్ పథకం కింద రూ.450 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ఇవాళ ఆయన సందర్శించారు. టెర్మినల్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. ప్రధాని మోదీ త్వరలోనే దాన్ని జాతికి అంకితం చేస్తారని వివరించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సైతం వేగంగా సాగుతున్నాయని ఆయన అన్నారు. యాదాద్రితో పాటుగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి సమీపంలో నూతన రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. అది కూడా పూర్తి అయితే యాదాద్రికి, కొమురవెల్లికి ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వివరించారు. యాదాద్రికి MMTS రైళ్లు నడపాలని భక్తులు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎంఎంటీఎస్ రెండోదశ పనులు కొనసాగుతున్నాయి. MMTS ట్రైన్లు యాదాద్రి సమీపంలోని రాయగిరి స్టేషన్‌ వరకు పొడగించాలని ఏడేళ్ల క్రితమే నిర్ణయించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 08:26 PM