Share News

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

ABN , Publish Date - Mar 21 , 2024 | 03:30 PM

లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మల్కాజిగిరి (Malkajgiri)లో కాంగ్రెస్ గెలుపు తనకు మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. తన బలం, బలగం ఇక్కడి నేతలేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ ఎంపీ సీటు గెలవాల్సిందేనని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్‌గిరిదని వివరించారు. తాను సీఎంగా ఉన్నానంటే ఆ గొప్పతనం ఇక్కడి నాయకులదేనని తెలిపారు.

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మల్కాజిగిరి (Malkajgiri)లో కాంగ్రెస్ గెలుపు తనకు మరింత బాధ్యతను పెంచుతుందని అన్నారు. తన బలం, బలగం ఇక్కడి నేతలేనని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇక్కడ ఎంపీ సీటు గెలవాల్సిందేనని అన్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజ్‌గిరిదని వివరించారు. తాను సీఎంగా ఉన్నానంటే ఆ గొప్పతనం ఇక్కడి నాయకులదేనని తెలిపారు. గురువారం నాడు గాంధీభవన్‌లో మల్కాజ్‌గిరి కీలక నేతలతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... 2019లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పతనం ఇక్కడి నుంచే మొదలైందన్నారు. ఆ నాడు కొంతమంది నాయకులు అమ్ముడుపోయినా కార్యకర్తలు తనను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారని గుర్తుచేశారు. మల్కాజ్‌గిరి‌లో ఉన్న 2,964 పోలింగ్ బూత్‌లలో కాంగ్రెస్ కార్యకర్తలు తన గెలుపు కోసం ఎంతగానో కష్టపడ్డారని చెప్పారు. ఇక్కడి నుంచి తన గెలుపు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వందరోజులు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టామని అన్నారు.

BRS: ఆ ఐదు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ తర్జనభర్జన

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ రూ. 10లక్షలకు పెంపు, రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలను అమలు చేసుకుంటున్నామని చెప్పారు. మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని వివరించారు. మల్కాజ్‌గిరి అభివృద్ధి కోసం కేంద్రంతో సఖ్యతగా ఉండి స్కైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. ఇక్కడకు మెట్రో, ఎంఎంటీఎస్ రావాలన్నా జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్‌ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థికి ఫలితాలు ఆశించిన స్థాయిలో రాలేదని అన్నారు.

TS News: కాంగ్రెస్‌కు ఖమ్మం టెన్షన్.. టికెట్ కోసం ముగ్గురు మంత్రుల మధ్య పోటీ

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి

మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ గెలిస్తేనే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పార్లమెంట్‌తో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలవాలని చెప్పారు. వచ్చే హోలీ పండుగలోగా అధిష్ఠానం ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తుందని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన నేతలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసే బాధ్యత తనదని చెప్పారు. మనకు బలమైన నాయకత్వం ఉందని.. సమన్వయంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎంపీ ఎన్నికల కోసం ఓ కమిటీని వేసుకోవాలని చెప్పారు. వారికి పోలింగ్ బూత్‌ల వారీగా పని విభజనను అప్పగించి రోజువారిగా సమీక్షించుకోవాలని చెప్పారు. రేపు(శుక్రవారం) సాయంత్రం కంటోన్మెంట్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించుకోవాలని తెలిపారు. ఉదయం 7 గంటలకే నాయకులు బస్తీల్లో ప్రచారం చేసుకునేలా ప్రణాళికలు వేసుకోవాలని వివరించారు. మల్కాజిగిరి క్యాంపైయిన్ మాదిరిగానే రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించేలా చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Phone Tapping Case: ప్రణీత్ రావు కేసులో కీలక మలుపు

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 21 , 2024 | 03:53 PM