Share News

CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు

ABN , Publish Date - Apr 02 , 2024 | 04:11 PM

తుక్కుగూడలో ఈనెల 6వ తేదీన ఏఐసీసీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిందని.. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మంగళవారం నాడు తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై నిర్వాహకులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు.

 CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు

రంగారెడ్డి: తుక్కుగూడలో ఈనెల 6వ తేదీన ఏఐసీసీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిందని.. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మంగళవారం నాడు తుక్కుగూడ సభా ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి పరిశీలించారు. సభ ఏర్పాట్లు, ఇతర అంశాలపై నిర్వాహకులకు సీఎం రేవంత్ పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ (Congress) కు తెలంగాణ కంచుకోట అని నిరూపిస్తామన్నారు. తుక్కుగూడ సభలో ఏఐసీసీ మ్యానిఫెస్టో విడుదల చేస్తుందని తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే... రాష్ట్రానికి జరిగే మేలును ఈ సభ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. ఈ సభలో మహిళలకు ప్రత్యేక సీట్లు ఏర్పాటు చేస్తామన్నారు. సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారెంటీలను తెలంగాణలో ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ రావడంతో పథకాలకు కొంత అంతరాయం కలిగిందని చెప్పారు. ఎన్నికల తర్వాత మిగతా హామీలను అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

Kadiyam Srihari: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదు: కడియం శ్రీహరి


కేసీఆర్ పాపాలతోనే ఈ కరువు...

పదేళ్ల తర్వాత అయినా మాజీ సీఎం కేసీఆర్ (KCR) పొలం బాట’ పట్టడం సంతోషమని చెప్పారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయినందుకు, కవిత జైలుకు పోయినందుకు కేసీఆర్‌ను చూస్తుంటే జాలి కలుగుతుందని అన్నారు. ఆయనకు ఏ సీజన్ ఎప్పుడు వస్తుందో తెలియదా అని ప్రశ్నించారు. కేసీఆర్ పాపాలతోనే ఈ కరువు పరిస్థితులు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పాపాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతాలో వేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధును వేయడానికి 10 నెలల సమయం తీసుకుందని చెప్పారు. 65 లక్షల రైతుల ఖాతాలో తాము రైతుబంధు వేశామని.. మిగిలింది 4 లక్షల రైతులేనని ఎన్నికలు అయిపోగానే వీరికి కూడా రైతు బంధు వేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Big Breaking: కల్వకుంట్ల కుటుంబాన్ని వెంటాడుతున్న అరెస్టులు!


రైతులపై కేసీఆర్‌ది కపట ప్రేమ

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ మొన్నటి పర్యటనలో జనరేటర్‌తో ప్రెస్‌మీట్ పెట్టి విద్యుత్ పోయిందని తమ ప్రభుత్వంపై నిందలు వేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తాము ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే తమను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తాము తలుచుకుంటే కేసీఆర్ బయటకు వెళ్లేవారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఖాతాలో రూ. 1500 కోట్లు ఉన్నాయని.. రైతులకు రూ.100 కోట్లు సహాయం చేయొచ్చు కదా అని చెప్పారు. ఎంపీ ఎన్నికల కోసమే కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి సెటైర్లు వేశారు.

ఢిల్లీ అందుకే వెళ్తున్నాం...

కేసీఆర్ న్యాయమైన సలహాలు, సూచనలు ఇస్తే అమలు చేస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేశామని వివరించారు. తాము ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి తెలంగాణ హక్కులు సాధిస్తున్నామని.. అందుకే అక్కడకు వెళ్తున్నామని అన్నారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని తెలిపారు. కేసీఆర్ పాపాల వల్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు పారిపోతున్నారని దెప్పిపొడిచారు. ఆ పార్టీ నేతలను కాపాడుకోవడానికి కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ చెల్లని వెయ్యి రూపాయల నోటని ఎద్దేవా చేశారు. జూన్ 9వ తేదీ తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని అన్నారు. ఆ రోజే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఇండియా కూటమి ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్‌లో కొత్త పథకాలను అమలు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని సీఎం రేవంత్ అన్నారు.

Harish Rao: దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా సర్కారు తీరు..


బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే...

ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని పథకాలను రాష్ట్రంలో అమలు చేసేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అన్ని సమస్యలు ఉన్నాయని నీళ్లు ఎత్తిపోయడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. వేసవిలో నీటి సమస్యలు రాకుండా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని... ఈ రెండు పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీశాయని అన్నారు. చనిపోయిన రైతుల వివరాలు ఇచ్చేందుకు కేసీఆర్‌కు 48 గంటల సమయం ఇస్తున్నానని అన్నారు. ఆ లోగా రైతుల వివరాలు ఇస్తే ఎన్నికల కోడ్ ముగియగానే రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Komatireddy Venkatreddy: సికింద్రాబాద్ ఎంపీగా దానంను గెలిపించడమే మా బాధ్యత

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 02 , 2024 | 04:49 PM