Share News

Congress: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Aug 16 , 2024 | 02:42 AM

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఆయన అగ్ర నేతలతో సమావేశం కానున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి.

Congress: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

  • నేడు సోనియా, రాహుల్‌తో పాటు కాంగ్రెస్‌ అగ్ర నేతలతో భేటీ

  • పీసీసీ చీఫ్‌, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులపై చర్చ

  • రుణమాఫీపై వరంగల్‌ కృతజ్ఞత సభకు సోనియాకు ఆహ్వానం

హైదరాబాద్‌, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఆయన అగ్ర నేతలతో సమావేశం కానున్నారని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా, రాహుల్‌గాంధీతో సమావేశమై టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీపై చర్చించనున్నారు. అనంతరం తుది నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీలో టీపీసీసీ కార్యవర్గంపైన చర్చించనున్నారు. టీపీసీసీలో నాలుగు కార్యనిర్వాహక అధ్యక్ష పదవులనూ భర్తీ చేసేందుకు అధిష్ఠానం కసరత్తు చేస్తోంది.


రెడ్డి, మైనార్టీ వర్గాలకు చెరోటి కేటాయించే అవకాశాలున్నాయి. కాగా, ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణ మాఫీ చేసినందున రైతులతో వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న భారీ సభకు సోనియాను సీఎం ఆహ్వానించనున్నట్లు తెలిసింది. 32.50 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం స్వల్ప వ్యవధిలోనే రూ.31 వేల కోట్ల కేటాయించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వరంగల్‌ సభను తలపెట్టారు. కాగా, టీపీసీసీ చీఫ్‌ రేసులో బీసీల నుంచి మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్‌, ఎస్టీల నుంచి ఎంపీ బలరాంనాయక్‌, ఎస్సీల నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌ ఉన్నారు.

Updated Date - Aug 16 , 2024 | 02:42 AM