Mahesh Kumar Goud: విధేయతకు దక్కిన గౌరవం
ABN , Publish Date - Sep 07 , 2024 | 03:20 AM
టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.
మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కాంగ్రెస్ నేతల అభినందనలు
బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కింది: పొన్నం ప్రభాకర్
రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత బలపడుతుంది: జూపల్లి
హైదరాబాద్/న్యూఢిల్లీ, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు. ఇది విధేయతకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ నియామకంతో బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ నిబద్దతకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వం, మహేశ్‌కుమార్‌గౌడ్ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.
కాగా, మహేశ్‌కుమార్ గౌడ్ సారథ్యంలో బీసీలకు పూర్వవైభవం వస్తుందని ఆస్తున్నట్లు మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహేశ్‌కుమార్ గౌడ్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం సరైనదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్ నియామకం పట్ల టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జగ్గారెడ్డి, గీతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తదితరులు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అభినందనలు తెలిపారు. గాంధీభవన్‌లో పలువురు నేతలు బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.