Share News

CPI: నల్లగొండ నుంచే పునర్నిర్మాణం : కూనంనేని

ABN , Publish Date - Dec 30 , 2024 | 04:28 AM

‘‘పోరాటాల గడ్డ నల్లగొండ నుంచే కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణం ప్రారంభిస్తాం.

CPI: నల్లగొండ నుంచే పునర్నిర్మాణం : కూనంనేని

  • నేడు నల్లగొండలో పార్టీ రాష్ట్ర బహిరంగ సభ

నల్లగొండ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘పోరాటాల గడ్డ నల్లగొండ నుంచే కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణం ప్రారంభిస్తాం. సోమవారం జరిగే పార్టీ రాష్ట్ర బహిరంగసభలో సమాజంలోని వివిధ వర్గాలు, సమస్యలపై పోరాటాల కోసం క్యాలెండర్‌ ప్రకటిస్తాం’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. సీపీఐ శతవసంతాల ఉత్సవాల్లో భాగంగా సోమవారం నల్లగొండలో నిర్వహించే పార్టీ బహిరంగసభ ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం వచ్చిన ఆయన.. పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.


పార్టీకి మొదటి నుంచి బలమైన నేపథ్యం కలిగిన నల్లగొండ జిల్లాలో మొదటి రాష్ట్ర బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, సభకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 30 , 2024 | 04:28 AM