Share News

TG: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రె్‌సకే మా మద్దతు

ABN , Publish Date - May 25 , 2024 | 03:35 AM

వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకే తమ మద్దతు అని తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శుక్రవారం తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.

TG: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రె్‌సకే మా మద్దతు

  • సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం,

  • మాల మహానాడు సంఘాల జేఏసీ

పంజగుట్ట,హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): వరంగల్‌-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకే తమ మద్దతు అని తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శుక్రవారం తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో పాత పింఛను విధానం పునరుద్ధరణ చేసే దిశగా ప్రజాపాలన సాగుతున్నందున కాంగ్రెస్‌ అభ్యర్థిని సీపీఎస్‌ ఉద్యోగులు బలపరుస్తున్నట్లు చెప్పారు. కాగా, రహదారులు, భవనాల శాఖలో పని చేస్తూ చనిపోయిన సీపీఎస్‌ ఉద్యోగి కుటుంబానికి పింఛను పత్రాలను ఆయన అందజేశారు.


పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నకే అని మాలమహానాడు, మాల ప్రజాసంఘాల జేఏసీలు ప్రకటించాయి. దళిత బహుజన పట్టభద్రులంతా తీన్మార్‌ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాలమహానాడు నాయకులు పిలుపునిచ్చారు. తీన్మార్‌ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని తెలంగాణ మాల సంఘాల జేఏసీ చైర్మన్‌ చెరుకు రాంచందర్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - May 25 , 2024 | 03:35 AM