Share News

Teachers: టీచర్లకు డిప్యూటేషన్‌!

ABN , Publish Date - Jul 09 , 2024 | 02:49 AM

తాత్కాలిక సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌ను కల్పిస్తున్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే.

Teachers: టీచర్లకు డిప్యూటేషన్‌!

  • విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాత్కాలిక సర్దుబాటు

హైదరాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): తాత్కాలిక సర్దుబాటు పేరిట ఉపాధ్యాయులకు డిప్యూటేషన్‌ను కల్పిస్తున్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన విషయం తెలిసిందే. దాంతో పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండక పోగా, మరికొన్ని చోట్ల టీచర్లు ఎక్కువ, విద్యార్థులు తక్కువ ఉన్నారు. దాంతో బోధనలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం డిప్యూటేషన్‌ను అమలు చేస్తున్నారు. ఈ సర్దుబాటులో భాగంగా మండల పరిధిలో, మండలం దాటి డిప్యూటేషన్లను ఇస్తున్నారు. దీని ద్వారా రాష్ట్రంలో 4 వేల మంది టీచర్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది.


బదిలీ అయిన టీచర్లను పాత పోస్ట్‌ నుంచి రిలీవ్‌ చేయాలి!

బదిలీ అయిన టీచర్లను వెంటనే పాత పోస్టింగ్‌ నుంచి రిలీవ్‌ చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు చావా రవి, సదానందం, జంగయ్య తదితరులు కోరారు. ఈ మేరకు సోమవారం విద్యా శాఖ కార్యదర్శి వెంకటేశంను కలిసి వినతి పత్రం సమర్పించారు.


జేఎల్‌ నియామక పరీక్ష ఫలితాల వెల్లడి!

ఇంటర్మీడియట్‌ విద్యలో జూనియర్‌ లెక్చరర్ల(జేఎల్‌) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీపీఎ్‌ససీ)అధికారులు సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో సీడీఆర్‌టీ మోడ్‌లో ఈ పరీక్షలను నిర్వహించారు. జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి మెరిట్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక పోస్టుకు ఇద్దరు(1:2 నిష్పత్తి) చొప్పున అభ్యర్థులను ఎంపిక చేశారు.

Updated Date - Jul 09 , 2024 | 02:49 AM